ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంలో వాక్యూమ్ బాంబులు వాడుతొందని అంతర్జాతీయ యుద్ధ ఆయుధాల నిపుణులు తేల్చారు. అత్యంత నీచమైన , అమానుషమైన ఈ పనికి రష్యా వాక్యూమ్ బాంబులు వాడటంద్వారా యుద్ధ నీతిని ఉల్లంఘించింది. 1899, మరియు 1907 సంవత్సరాల్లో హేగ్ సదస్సు నియమాలప్రకారం వాక్యూమ్ బాంబులు వాడకం నిషిద్ధం. పౌర నివాసాలు , పాఠశాలలు , హాస్పిటల్స్ లాంటి సంస్థలపైన ఈ బాంబులు వాడకూడదు. అయితే , ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పై ఈ బాంబులనే వాడుతొంది. విధ్వంసం సృష్టిస్తోంది. అసలు వాక్యూమ్ బాంబులు అంటే ఏమిటో , అవి సృష్టించే విధ్వంసం ఎలాంటిదో చూడండి..
వాక్యూమ్ బాంబులను , సాంకేతికంగా TOS – 1A బాంబులు అంటారు. వీటినే ఏరోసోల్ , థెర్మోబారిక్ బాంబులు అని కూడా అంటారు. ఈ బాంబు రెండు రసాయనాలతో పేలుతుంది. మొదట లక్ష్యాన్ని తాకినవెంటనే పేలుడు సంభవిస్తుంది. ఆ తరువాత ఆ బాంబు పేలిన ప్రాంతంలో వాతావారణంలో ఉన్న ఆక్సిజెన్ ను , గ్రహించి పేలుడు జరుగుతుంది. ఇది ఆత్యంత శక్తివంతంగా ఉంటుంది. . బంకర్లలో దాగి ఉన్నా , ఈ బాంబు పేలితే , ఆ పరిసరాలలో మనిషిలోని ఆక్సిజెన్ ని , ఇది గ్రహించి చంపేస్తుంది.
బాంబు పేలుడు జరిగిన వెంటనే వాతావారణంలో ఉన్న ఆక్సిజెన్ ను, తీసుకోవడంతో అక్కడ సూన్యం ఏర్పడుతుంది. భరించలేనంత వేడి పుడుతుంది. ఈ వేడికి శరీరం కాలిపోయి , ఆవిరైనట్టు అయిపోతుంది.. అంత బీభత్సం సృష్టించే బాంబు కాబట్టి దీనిని పౌర నివాసాలు , పాఠశాలలు , హాస్పిటల్స్ లాంటి సంస్థలపైన ప్రయోగించకూడదు. అలాచేస్తే రసాయనిక ఆయుధాల ప్రయోగం కిందనే పరిగణించి , యుద్ధనేరంగా భావిస్తారు. అయితే రష్యా అవేమి పట్టించుకోకుండా ఉక్రెయిన్ పౌర నివాసాలు , పాఠశాలలు , హాస్పిటల్స్ లాంటి సంస్థలపైన వాక్యూమ్ బాంబులు వేస్తోంది..ఈ బాంబు సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి..
The Russian MoD has confirmed the use of the TOS-1A weapon system in Ukraine. The TOS-1A uses thermobaric rockets, creating incendiary and blast effects.
Watch the video below for more information about this weapon and its devastating impact.
🇺🇦 #StandWithUkraine🇺🇦 pic.twitter.com/d8PLQ0PhQD
— Ministry of Defence 🇬🇧 (@DefenceHQ) March 9, 2022