జనసేన ఆవిర్భావ సభకోసం నాగబాబు కొత్త గెటప్ లో రెడీ అయ్యారు. ఆమధ్య పార్టీ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉన్న మెగ బ్రదర్ ఇటీవల మత్స్యకార సభ సమయం నుంచి మళ్లీ హడావిడి మొదలు పెట్టారు. తాజాగా.. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జరగబోతున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. నల్ల మీసం, తెల్లగడ్డంతో కొత్త లుక్ లో వచ్చారు నాగబాబు. కళ్లజోడు, లాల్చీ పైజామాలో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈసారయినా రీఎంట్రీ కొన్నాళ్లు కొనసాగుతుందా.. లేక మళ్లీ అలిగి వెళ్లిపోతారా.. వేచి చూడాలి.
మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభ ప్రాంగణం ను పరిశీలిస్తున్న పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీ కె.నాగబాబు గారు, జనసేన నాయకులు. pic.twitter.com/6Xr5qCJaJG
— JanaSena Party (@JanaSenaParty) March 12, 2022