అది మామూలు హెలికాప్టర్ కాదు.. కూలిపోయింది..

    0
    17685

    రక్షణ దళాల ప్రధాన అధిపతి తన కుటుంబం, మరియు ఇతర అధికారులతో కలసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో కూలిపోవడానికి దట్టమైన మంచు వాతావరణమే కారణం అని చెబుతున్నారు. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం జరగడానికి ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణ దళాల ప్రధాన అధిపతి, ప్రయాణించే హెలికాప్టర్ అంటే, దాన్ని పూర్తిగా తనిఖీ చేసి ఇబ్బంది లేకుండా చేయవలసి ఉంటుంది. అత్యంత ఉన్నతమైన భద్రతా ప్రమాణాలను ఈ హెలికాప్టర్ ప్రయాణంలో వినియోగించాల్సి ఉంటుంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్, రష్యా కు చెందిన ఖజన్ హెలికాప్టర్స్ కు చెందిన russi aరకానికి చెందినది. 9ఏళ్ల క్రితమే ఈ హెలికాప్టర్ ను భారత వైమానిక దళంలోకి తీసుకున్నారు.

    రక్షణ రంగానికి చెందిన హెలికాప్టర్లలో ఇది సాంకేతికంగా అత్యున్నతమైనది. ఈ హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో 13వేల కిలోల బరువుని తీసుకుపోగలదు. 36మంది సైనికులను లేదా 4,500కిలోల సరకులను కూడా మోయగలదు. ప్రతి MI17-V5 హెలికాప్టర్ కు నేవిగేషన్, ఎలక్ట్రానిక్ డిస్ ప్లే సిస్టమ్ ఉంటుంది. ప్రపంచంలోనే ఈ హెలికాప్టర్లను అత్యున్నతమైనవిగా పరిగణిస్తారు.

    యుద్ధ హెలికాప్టర్లకు ఎస్కార్ట్ గా యుద్ధాలకు ఆయుధాలను తీసుకునిపోవడం, సరిహద్దుల వద్ద పహారా కాయడానికి ఈ హెలికాప్టర్లను వాడతారు. ప్రధాన మంత్రి, హోమ్ మినిస్టర్ కార్యాలయాల పనులకోసం కూడా దీన్ని వాడతారు. రెండేళ్ల క్రితమే అగ్రిమెంట్ ప్రకారం రష్యా కంపెనీ ఈ హెలికాప్టర్లకు మరమ్మతులు చేసి సర్వీసింగ్ చేసి ఇచ్చింది. ప్రస్తుతం మనదేశంలో ఇలాంటి హెలికాప్టర్లు 200 వరకు ఉన్నాయి.

    శత్రువులు ఈ హెలికాప్టర్ పై ఆయుధాలను ప్రయోగించినా, రక్షించుకునే బులెట్ ప్రూఫ్ రక్షణ వ్యవస్థ దీని ప్రత్యేకత. ఎ.ఎఫ్.టి మిషన్ల గన్లను అమర్చుకునే సౌకర్యం కూడా ఈ హెలికాప్టర్లకు ఉంటుంది. ఒకవేళ హెలికాప్టర్ ఫ్యూయల్ ట్యాంక్ లో పేలుడు సంభవిస్తే, దానినుంచి రక్షణ పొందేందుకు అవసరమైన పాలీ యురిత్రేనే ఫోమింగ్ సిస్టమ్ కూడా ఈ హెలికాప్టర్ ప్రత్యేకత. జామర్లు కూడా ఈ హెలికాప్టర్లకు ఉంటాయి.

    ప్రస్తుతం ప్రమాదానికి గురైన ఈ హెలికాప్టర్ కు క్షిపణులు, S8 రాకెట్లు, 23ఎంఎం మిషన్ గన్లు, వికెటి మిషన్ గన్లు, ఎకెఎం మిషన్ గన్లు అమర్చి ఉంటారు. అంతటి పగడ్బందీగా రక్షణ వ్యవస్థ కలిగి ఉండే అత్యంత సాంకేతికతతో కూడిన ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం నిజంగా దురదృష్టకరం అయినా, ఇప్పుడు యద్ధ హెలికాప్టర్ల పనితీరుపైన, ఒక అత్యున్నతమైన సైనిక దళాల అధిపతి ప్రయాణించేటపుడు అనుసరించాల్సిన ముందస్తు జాగ్రత్తతలపైనా చర్చ నెలకొని ఉంది.

    ఇవీ చదవండి

    బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

    కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.