ఈ ఏడాదికి ఇదే చివరి ఘోరం కావాలి..

  0
  5573

  పశ్చిమగోదావరి జిల్లా లోని జంగారెడ్డిగూడెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెం వెళుతుండగా బస్సు డివైడర్ ను ఢీ కొట్టి జిల్లేరు వాగులో బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో 47మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఊపిరాడక 9మంది చనిపోయారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. డ్రైవర్ కూడా స్పాట్ లోనే చనిపోయాడు.

  అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వాగు నుంచి బస్సును వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సు బయటకు వస్తేగాని మొత్తం మృతుల సంఖ్య ప్రకటించలేమని అధికారులు తెలిపారు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.