ఆరోజు బయటకు రావొద్దు.. తన్నులు తినొద్దు..

  0
  4023

  దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనలు నెలకొన్నాయి. మరో రెండు వారాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ రాష్ట్రాలన్నీ అలర్ట్ అయ్యాయి. డిసెంబర్-31, జనవరి-1 న.. తమిళనాడులో బీచ్ ల వద్ద జనసంచారంపై నిషేధం విధించింది స్టాలిన్ సర్కారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో అందరూ ఒకచోట గుమికూడటం ఈ సారి కుదరదని చెప్పింది. కరోనా ప్రొటోకాల్ పాటించాల్సిందేనని చెప్పింది. మిగతా అన్ని రోజుల్లో ఉన్న నిబంధనలను ఆ రెండు రోజులు మరింత కఠినతరం చేస్తామని చెప్పింది. ఇదే బాటలో మిగతా రాష్ట్రాలు కూడా ఆ రెండ్రోజులపాటు నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని చెబుతున్నాయి. డిసెంబర్-31న, జనవరి-1 సంబరాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తున్నారు పోలీసులు.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.