యమహా నగరి ,కలకత్తా పురిలో RRR టీమ్..

  0
  59

  ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ అవుతోంది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ చిత్రం ప‌లు భాష‌ల్లో విడుద‌ల‌వుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది.

  మొన్న‌టికి మొన్న‌ గుజరాత్‌లోని ‘స్టాచ్యు ఆఫ్ యూనిటీ’ దగ్గర ఈ ముగ్గరు సందడి చేశారు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి అక్కడ ఫోటోలు దిగారు. అటునుంచి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో పూజ‌లు చేశారు.

  ఈ త్ర‌యం రోజుకో నగరం తిరుగుతూ భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. జైపూర్ లోని హ‌వామ‌హ‌ల్ వ‌ద్ద సంద‌డి చేసిన ఈ RRR త్ర‌యం… ఇప్పుడు కోల్ క‌త్తాలోని హౌరా బ్రిడ్జిపై మెరిసింది.

  ఈ ముగ్గురి ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

   

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..