లేడీ డాక్టర్ పై అత్యాచారం..ఒక్కరు కాదు, నలుగురు.

  0
  278

  లేడీ డాక్టర్ పై అత్యాచారం.. ఒక్కరు కాదు, నలుగురు..
  రాయవెల్లూరులో ఓ మహిళా డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరిగింది. స్నేహితుడితో కలసి ఆ డాక్టర్ కాట్పాడిలో ఓ సినిమా థియేటర్లో సెకండ్ షో సినిమా చూసి వచ్చింది. ఆ తర్వాత అర్థరాత్రి షేర్ ఆటోలో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. అప్పటికే ఆటోలో నలుగురు వ్యక్తులున్నారు. వారంతా కలసి ఆటోని సత్వచారి రోడ్ గుండా మరో రోడ్ కి మళ్లించారు.

  లేడీ డాక్టర్ డ్రైవర్ ని వారిస్తున్నా వినకుండా పాలార్ నది ఒడ్డుకి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ స్నేహితుడిపై దాడి చేసి, అతడిని కొట్టి తరిమేశారు. అనంతరం ఆ నలుగురు యువకులు కలసి, లేడీ డాక్టర్ పై దారుణానికి తెగబడ్డారు. అత్యాచారం చేశారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆమె రాయవెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తోంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..