ఒక నర్సు , ఇద్దరు లవర్స్ , ఒక మొగుడు.. ట్విస్ట్ ఏమిటంటే..?

  0
  509

  ఒక యువతి ఒక మొగుడు, ఇద్దరు ప్రియుళ్లు.. ఈ ట్రిపుల్ లవ్ గేమ్ లో ఆ యువతి మొదటి ప్రియుడు నజీర్ ను రెండో ప్రియుడు రెహ్మాన్ తో కలసి చంపాలని పథకం వేసింది. ఇందుకోసం నజీర్ ను నెల్లూరు పాలెం వద్దకు రమ్మని, రెండో ప్రియుడు రెహ్మాన్ తో కలసి అతడిని కారుతో ఢీకొట్టి చంపేయాలని నిర్ణయించుకుంది. చివరిగా తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన నజీర్ జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు అసిఫా అనే స్టాఫ్ నర్స్ ను ఆమె, రెండో ప్రియుడు రెహ్మాన్ ను అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.

  ఈ గందరగోళం లవ్ స్టోరీలో అసలు కథ ఇది. ఆత్మకూరు ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్న షేక్ అసిఫా అదే ఆస్పత్రిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నజీర్ ను ప్రేమించింది. ఆ తర్వాత పెద్దలు ఒప్పుకోకపోవడంతో 2021లో కావలికి చెందిన షేక్ అలీంను, అసిఫా పెళ్లి చేసుకుంది. అలీంతో కొంతకాలం తర్వాత విడాకులు తీసుకుని మళ్లీ మొదటి లవర్ నజీర్ తో సంబంధాలు పెట్టుకుంది. ఆ తర్వాత తనకు ఇదివరకే పరిచయం ఉన్న రెహ్మాన్ తో నిశ్చితార్థం జరిగింది.

  నజీర్ తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని అందువల్ల నజీర్ ను చంపాలని రెహ్మాన్ ని కోరింది. దీంతో నజీర్ ఫోన్ లో తనకు సంబంధించిన ఫొటోలు, చాటింగ్ లు ఉన్నాయని చెప్పింది. ఆ తర్వాత నజీర్ రెహ్మాన్, అసిఫా ఇద్దరూ కలసి నజీర్ ని మాట్లాడాలని రమ్మన్నారు. అతను ఆత్మకూరుకి స్కూటీపై వస్తున్న క్రమంలో కావలి నుంచి కారులో వచ్చి, నెల్లూరుపాలెం నుంచి వింజమూరు రోడ్డుకి వస్తూ నెల్లూరుపాలెం సెంటర్ కి దగ్గర్లో ఎదురుగా వస్తున్న నజీర్ స్కూటీని బలంగా కారుతో ఢీకొట్టారు. నజీర్ ని చంపేయాలనే ఉద్దేశంతోటే ఇద్దరూ ఈ పథకం వేశారు. వీరి గుట్టు రట్టు కావడంతో పోలీసులు వీరిద్దర్నీ అరెస్ట్ చేశారు.

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..