ఆపుకోలేని రాజమౌళి..
అందుకే ఈ నెల 14న విడుదల..
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చెక్కిన RRR మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు మెగా ఫామిలీ అభిమానులు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. అన్నీ బాగున్నాయి అనుకొని సినిమాని విడుదల చేసే సమయానికి కరోనా థర్డ్ వేవ్ ముంచుకొచ్చింది.
దీంతో అప్పటివరకూ సినిమా ప్రమోషన్లు కూడా చేసిన మూవీ యూనిట్ సైలెంట్ అయిపోయింది. అయితే తాజాగా రాజమౌళి మూవీకి సంబంధించిన సంచలనం విషయాన్ని బయటపెట్టేశాడు. మార్చి14న ఈ మూవీలోని “ఎత్తర జెండా” అనే పార్టీ సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. RRR మూవీలో ఈ పాటను ఎండ్ టైటిల్స్ వేసే సమయంలో ప్లే చేయాలని తొలుత భావించామని.. అయితే ఆపుకోలేక ఈపాటను ముందుగానే విడుదల చేస్తున్నట్టు చెప్పారు.