రామ్ చరణ్, ఎన్టీఆర్ కి ధీటుగా అజయ్ దేవ్ గణ్..

  0
  171

  ఆర్ఆర్ఆర్ లో హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్.. వీరిద్దరేనా మూడో హీరో కూడా ఉన్నారనే అనుమానాలు రేకెత్తిస్తున్నారు దర్శకుడు రాజమౌలి. తెలుగు ఇండస్ట్రీకి కంబంధించి ఎన్టీఆర్, రామ్ చరణ్ చాలు, బాలీవుడ్ ని ఆకట్టుకోవాలంటే హిందీ హీరోలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. అందుకే అజయ్ దేవ్ గణ్ కి ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు సినిమాలో అంతే ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో ఆ విషయం తెలుస్తోంది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా అజయ్ దేవ్ గణ్ ని చూపించబోతున్నారు రాజమౌళి.

  450కోట్ల భారీ బడ్జెట్ తో తీస్తున్న ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌ గా ఎన్టీఆర్ కనిపిస్తారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌ హీరోయిన్లు. శ్రియ, సముద్రఖని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తారు. కీరవాణి సంగీతాన్నిస్తున్నారు. అక్టోబర్‌ 13న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు దర్శక నిర్మాతలు. తాజాగా అజయ్ దేవ్ గణ్ ఫస్ట్ లుక్ తో మరింత ఆసక్తి పెంచారు.

  ఇవీ చదవండి

  మందుబాబులు వాక్సిన్ వేసుకోవచ్చా..?

  మాస్క్ లేకపోతె మోకాళ్ళమీద నడిపిస్తారు.

  నౌకను చంద్రుడు కదిలించాడు..

  బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే.