ఆర్ఆర్ఆర్ మూవీ ఇటీవలే థియేటర్లలో విడుదలైంది. అయితే ఇంత భారీ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలంటే ఎక్కువరోజులు ఆగుతారని అనుకున్నారంతా. కానీ అలాంటిదేమీ లేదు. ఆర్ఆర్ఆర్ ని కేవలం 90రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకొస్తారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా నెట్ ఫ్లిక్స్, జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. భారీ ధరకు ఇప్పటికే డిజిటల్ రైట్స్ దక్కించుకున్నాని.. సినిమా విడుదలై 90 రోజులు దాటిన తర్వాత ఆర్ఆర్ఆర్ ఓటీటీలో సందడి చేస్తుందట.
జీ5లో దక్షిణాది భాషలలో.. నెట్ ఫ్లిక్స్ లో హిందీతోపాటు.. ఇతర భాషలైన ఇంగ్లీష్, పోర్చుగల్, కొరియన్, టర్కీష్, స్పానిష్ భాషలలో స్ట్రీమింగ్ చేయనున్నారట. సినిమా విడుదలైన 90 రోజుల తర్వాతనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే నిబంధనను ముందే ఫిక్స్ చేసుకున్నారట మేకర్స్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టిస్తోంది. టాలీవుడ్ గత రికార్డ్స్‌ను తిరగరాస్తూ విజయవంతంగా దూసుకుపోతుంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. జక్కన్న విజువల్ మ్యాజిక్.. రామ్ చరణ్.. ఎన్టీఆర్ అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సినిమాకు ఎక్కడ చూసిన పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య దాదాపు 450 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇందులో చరణ్ అల్లూరి సీతారామారాజుగా.. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించారు.