వైసీపిలో మొదలైంది తిరుగుబాటా .? అసమ్మతా ? అలకా .? ఏది నిజం.. ??

  0
  316

  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండో దఫా మంత్రివర్గ విస్తరణతో పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంది. అసంతృప్తులు బుజ్జగింపులు మొదలయ్యాయి . ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన వల్ల పార్టీలో అసంతృప్తి బయటకు కనబడలేదు, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణతో ఇది బట్టబయలైంది. కొన్ని జిల్లాల్లో వీధికెక్కింది. మరికొన్ని జిల్లాల్లో నాయకులు ఉడికి పోతున్నారు . ఆశావహులు తమకు పదవులు రాలేదని ఆ సంతృప్తి చెందుతున్నారు. వీటన్నింటికంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ముందున్న పెద్ద సమస్య ,పార్టీలో సీనియర్ల అలకలు . మాజీ మంత్రుల మూతి విరుపులు . వీటిలో ఆయన సమీప బంధువు ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి అలక. మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ పూర్తిగా జరుగుతుందని , పాత వారి స్థానంలో పూర్తిగా కొత్తవారికి పదవులు ఇస్తానని, మొదటి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. దీని ప్రకారం అందరినీ తీసేసి కొత్త మంత్రుల్ని చేర్చుకోవాల్సి ఉంది . అయితే రాజీనామాలకు వారం రోజుల ముందు, రాజీనామాలు చేసిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి స్వరం మారింది . పాత మంత్రుల్లో కొంతమంది సీనియర్లను కొనసాగిస్తానని ,అలాగే పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా పని చేసే మంత్రులకు మళ్ళీ అవకాశం ఉంటుందని అన్నారు.

  దీంతో సహజంగానే కొంత మంది తమకు కూడా అవకాశం ఉంటుందని భావించారు. దానికి ముందు సామాజిక సమీకరణాల తో కొంత మందిని మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రకారం ఇద్దరు లేదా ముగ్గురు కొత్తమంత్రివర్గంలో కొనసాగే అవకాశం ఉంటుందని భావించారు. ఆ తర్వాత కొంతమంది కొంతమంది సీనియర్లకు మళ్ళీ అవకాశం కల్పిస్తామని చెప్పారు . సీనియర్ల సేవలు పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చేందుకు అవసరమని తెలిపారు. దీని ప్రకారం సామాజిక సమీకరణలు కాకుండా రాజకీయ కోణంలో కూడా మరికొంత మంది పాతవారిని కొత్త మంత్రివర్గంలో తీసుకుంటారని తేలింది. దీంతో చాలామంది సీనియర్లలో ఆశ మొదలైంది. వాళ్లలో ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని కూడా ఒకరు.. అయితే మంత్రివర్గ విస్తరణ నాటికి సీనియర్ మంత్రులు సీనియర్ మంత్రులు అంజాద్బాష ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ,పినిపే విశ్వరూప్ ,గుమ్మనూరు జయరాం , నారాయణ స్వామి, బొత్స సత్యనారాయణ ,తానేటి వనిత ,సీదిరి అప్పల రాజు , వేణు గోపాల కృష్ణ ,ఆదిమూలపు సురేష్ లను పాత మంత్రివర్గం నుంచి కొత్త మంత్రివర్గంలోకి తీసుకున్నారు .

  ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులలో బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తొలగించి ఆదిమూలపు సురేష్ ను తీసుకోవడం బాలినేనికి బాధ కలిగించింది . రెడ్డి వర్గానికి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని మళ్లీ కొనసాగించి తనను తొలగించడం ఆయన అవమానంగా భావిస్తున్నారు . దీంతో ఆయన అలిగారు. పాత మంత్రుల్లో ఇద్దఋ రెడ్లను కొనసాగించి మిగిలిన రెడ్లకు అవకాశం ఇవ్వలేదన్న బాధ కూడా మంత్రి పదవులు రాని రెడ్డి ఎమ్మెల్యేలలో ఉంది . దీంతో సహజంగానే అలకలు ,అసంతృప్తులు, మూతి విరుపులు మొదలయ్యాయి. మొదటి చెప్పినట్లు మంత్రులందరినీ పూర్తిగా తొలగించి కొత్త వారికి అవకాశం ఇచ్చి ఉంటే బహుశా ఇలాంటి అసంతృప్తులు అలకలు ఉండేవి కావు.

  నెల్లూరు జిల్లాలో కూడా సీనియర్ శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డికి మొదటినుంచి సైనికుడిగా పని చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని పక్కన పెట్టారు. శ్రీధర్ రెడ్డి ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే ఆ నియోజకవర్గంలో ఎంపీటీసీలు నెల్లూరులో కార్పొరేటర్లు మూకుమ్మడిగా రాజీనామాలు సిద్దపడి గొడవ చేశారు ఒక దశలో వారి అభిమానాన్ని చూసి కోటంరెడ్డి కూడా కంటతడి పెట్టుకోవాల్సి వచ్చింది. మాచర్లలో పిన్నెల్లి అనుచరులు రచ్చ చేశారు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాల పరిధిలో వైకాపా నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక నేతలు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.

  పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధికి మంత్రి పదవి ఇవ్వలేదని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నియోజకవర్గ మండల , గ్రామ స్థాయి నేతలు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుని నిరసన చేపట్టారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న అనుచరులను ఎమ్మెల్యే బుజ్జగించారు. జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరులు భగ్గుమన్నారు. ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. పెట్రోల్‌పోసి ద్విచక్రవాహనాన్ని తగులబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు.

   

  ఇవీ చదవండి… 

  బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

  మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

  ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

  ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి..