ఇలాగైతే కష్టమే.. పండగరోజు బయటికొస్తే అంతే..

    0
    328

    క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అందరూ సిద్ధమైపోయారు. అయితే ఇదే సమయంలో ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరగడం మొదలయ్యాయి. దీంతో కర్నాటక ప్రభుత్వం ముందుగానే ఆ రాష్ట్రంలో
    న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది. ఢిల్లీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు పెట్టింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా హైకోర్టు కీలక సూచన చేసింది. కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక ప్రభుత్వాల మాదిరిగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను పెట్టాలని తెలంగాణ హైకోర్టు సూచించింది.

    జనం గుంపులుగా ఉండకుండా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని కోరింది. ఎయిర్‌పోర్టు్లో ఉన్నట్టుగానే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించాలని కూడా హైకోర్టు తెలంగాన ప్రభుత్వానికి సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలకు జనం వచ్చే సమయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. వేడుకలు నిర్వహణ సమయంలో కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం లేదని కూడా ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారంతా మాస్క్ తప్పనిసరిగా ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ మాస్క్ ధరించకపోతే భారీ జరిమానాను విధించాలని కూడా ఆదేశించింది.రెండు , మూడు రోజుల్లో ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని కూడా హైకోర్టు సూచించింది.

    ఇవీ చదవండి… 

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.