తుక్కు బండికి కూడా టైమ్ వచ్చేసింది..

    0
    228

    మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకు కోరిక తీర్చేందుకు తుక్కుతో ఓ వాహనం తయారుచేశారు. ఆయన క్రియేటివిటీని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆ వాహనాన్ని తనకు ఇస్తే అందుకు బదులుగా బొలెరో ఇస్తానంటూ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.
    మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవ్‌రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్‌.. స్థానికంగా కార్పెంటర్ గా పనిచేసేవాడు. ఆయన కొడుక్కి కారు ఎక్కాలని చిన్నప్పటి నుంచి కోరిక. అయితే అంత స్తోమత లేని దత్తాత్రేయ.. తుక్కు వాహనాలనుంచి కొన్ని విడి భాగాలు సేకరించి సొంతంగా వాహనం తయారుచేశారు. కిక్‌ ఇస్తే స్టార్ట్‌ అయ్యేలా దీన్ని తయారుచేశాడు. అయితే ఇందులో స్టీరింగ్‌ ఎడమవైపు ఉండటం విశేషం.

    ఈ వాహనం గురించి ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని ఆనంద్ మహీంద్రా చూశారు. ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ.. ఆయన ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. మన ప్రజల తెలివితేటలు, తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాని అన్న మరీంద్రా దత్తాత్రేయకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా స్థానిక అధికారులు ఇప్పుడైనా, తర్వాతైనా ఈ వాహనాన్ని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటారు. ఈ వాహనాన్ని నాకు ఇస్తే అందుకు బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తాను అని ప్రకటించారు మహీంద్రా. మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీలో దీన్ని ప్రదర్శనకు ఉంచుతామని కూడా చెప్పారు.

    ఇవీ చదవండి… 

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.