ఇంతకాలానికి పెట్రోలు డీజిల్ ధరలు తగ్గాయి.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజువారీ గానో , లేదా రోజు మార్చి రోజు లేదా వారానికి ఒకసారో పెట్రోలు డీజిల్ ధరలు పెంచుకుంటూ పోవడం ఆనవాయితీగా మారింది .
కానీ ఇప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుభ వార్త చెప్పింది . పెట్రోల్, డీజిల్ మీద కేంద్ర పన్నులు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో లీటర్ పెట్రోల్ పై ఎనిమిది రూపాయలు , డీజిల్ పై ఆరు రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది .
పెట్రోల్ ధర తొమ్మిది రూపాయలు 50 పైసలు , డీజిల్ ధర ఏడు రూపాయలు తగ్గుతుంది . ఇదిలా ఉండగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి సిలిండపై 200 రూపాయలు సబ్సిడీ వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.అదీ ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపింది. దేశంలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద ఉజ్వల పథకం కింద.. 9 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి.