ఫోన్ చేస్తే సిమ్ ఓనర్ పేరే వస్తుంది..

    0
    275

    రోజురోజుకీ టెక్నాలజీ మారిపోతోంది. లేటెస్ట్ అప్డేట్ వర్షన్ల రాకతో కాలం కంటే వేగంగా టెక్నాలజీ ముందుకెళ్ళిపోతోంది. మొబైల్ ఫోన్ తో ఇప్పటికే ఎన్నో మార్పులొచ్చాయి. కొత్తకొత్త యాప్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

    తాజాగా మొబైల్ టెక్నాలజీలో మరొక విప్లవాత్మక మార్పు చోటుచేసుకోబోతోంది. ఇప్పటివరకూ మన ఫోన్ కు ఎవరైనా ఫోన్ చేస్తే వారి ఫోన్ నెంబర్ మన ఫోన్ డిస్ప్లే అయ్యేది.. భవిష్యత్తులో ఇకపై అలా మొబైల్ నంబర్స్ కనిపించవు. ఆ ఫోన్ నెంబర్ ఎవరిపై రిజిస్టర్ అయి ఉంటుందో వారి పేరు మాత్రమే కనిపించేలా ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ఇందుకోసం అన్ని మొబైల్ నెట్వర్క్ లకు ట్రాయ్ ఛైర్మెన్ పీడీ వాగేలా లేఖలు కూడా రాశారు. మీ అభిప్రాయాలూ.. సందేహాలూ తెలపాలంటూ లేఖలో పేర్కొన్నారు.

    ఇప్పటివరకూ మన మొబైల్లో ఏ నెంబర్ కు ఎవరి పేరైనా సేవ్ చేసుకునే విధానం ఉంది. అయితే ఈ కొత్త నిబంధన అమలైతే అలా నంబర్లు సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సిమ్ కార్డు తీసుకునేటప్పుడు ఇచ్చిన రిజిస్ట్రేషన్ వివరాలు మాత్రమే, ఫోన్ చేసినప్పుడు స్క్రీన్ మీద కనిపించబోతున్నాయి. ఈ మార్పు కారణంగా ఇకపై ట్రూ కాలర్ వంటి యాప్స్ అవసరం కూడా ఉండదు. త్వరలోనే ఈ కొత్త మార్పులు భారత్ లో చోటు చేసుకోబోతున్నాయి.

     

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి..