రెడ్ మి ల్యాప్ టాప్ లు వచ్చేస్తున్నాయ్..

  0
  36

  చవక ఫోన్లతో మార్కెట్ లో హల్ చల్ చేసిన షియోమీ సంస్థ ఇప్పుడు ల్యాప్ టాప్ లపై దృష్టిసారించింది. ‘రెడ్‌ మీ బుక్‌’ పేరుతో రెండు మోడళ్లను ల్యాప్‌ ట్యాప్‌లను విడుదల చేస్తున్నట్లు అధికారంగా ప్రకటించింది. గతేడాది రెడ్‌ మీ బ్రాండ్‌ పేరుతో భారీ ఎత్తున పవర్‌ బ్యాంక్స్‌, ఇయర్‌ బడ్స్‌, స్మార్ట్‌ బ్రాండ్‌ ను విడుదల చేసింది. ఈ ఏడాది స్మార్ట్‌ టీవీలను లాంఛ్‌ చేసింది. ఇప్పుడు అదే బ్రాండ్‌ పేరుతో ఇప్పుడు ల్యాప్ టాప్ లు మార్కెట్లోకి వస్తున్నాయి.

  రెడ్‌ మీ బుక్‌ ల్యాప్‌ టాప్‌ ఫీచర్స్‌
  ప్రస్తుతం ఉన్న విండోస్‌ – 10 తో పాటు త్వరలో అప్‌ డేట్‌ కానున్న విండోస్‌ -11ను అప్ గ్రేడ్‌ చేసుకునే విధంగా రెడ్‌ మీ బుక్‌ ల్యాప్‌ట్యాప్‌ డిజైన్‌ చేశారు. 15 అంగుళాల స్క్రీన్‌ సైజ్‌, ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, వెబ్‌ క్యామ్‌ కోసం లైట్‌ బెజెల్స్‌ను ఏర్పాటు చేశారు. డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, వీ 5.0 బ్లూటూత్‌, సీ టైప్‌ 3.1యూఎస్‌బీ, యూఎస్‌బీ టైప్‌ -ఏ,యూఎస్‌ బీ 2.0, ఆడియో జాక్‌, రెండు స్టెరో స్పీకర్స్‌ ఉన్నాయి. 8జీబీ ర్యామ్‌, 512జీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్ (ఎస్‌ఎస్‌డీ), 65 వాట్ల ఛార్జర్‌, ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే 10 గంటల పాటు వినియోగించుకోవచ్చేని రెడ్‌ మీ పేర్కొంది. ప్రస్తుతం ల్యాప్‌ ట్యాప్‌ స్పెసిఫికేషన‍్లు అందుబాటులోకి వచ్చినా ధరపై షియోమీ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. టెక్‌ నిపుణులు మాత్రం రెడ్‌ మీ బుక్‌ ల్యాప్‌ ట్యాప్‌లు రూ.50వేల లోపు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?