రోడ్డులో బోను.. బోనులో రికార్డ్ డ్యాన్స్ లు

    0
    1086

    పల్లెల్లో రికార్డు డ్యాన్స్ లంటే, అదో పెద్ద శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. తాగి వేదికలు ఎక్కేవారు, రికార్డు డ్యాన్సర్లను పట్టుకునేవారు, వారితో కలసి డ్యాన్స్ లు వేసేందుకు పోటీ పడేవారు, వారితో కొట్లాటలు. ఇప్పుడు ఈ రికార్డు డ్యాన్స్ ల భద్రతకోసం ఓ కొత్తరకం వాహనం ఏర్పాటు చేసుకున్నారు.

    చుట్టూ కట్టుదిట్టమైన స్టీల్ ఫ్రేమ్ తో ఓ బోనులాంటిదాన్ని ఏర్పాటు చేసి, దానిపైన లైటింగ్, మైక్ లు పెట్టిబోనులో రికార్డ్ డ్యాన్స్ లు వేస్తున్నారు. దీనివల్ల రికార్డ్ డ్యాన్సర్లకు ఒకరకంగా భద్రత, రెండోది వాళ్లతో డ్యాన్స్ లు వేయాలని, తాగి ఘర్షణలు పడే వాతావరణం తప్పుతుంది. ఇలా బోనులోనే ఉంటూ డ్యాన్స్ లు చూసేవారిని ఊరించి ఊరించి చంపుతున్నారు. ఇదో రకం సెన్సేషన్. బీహార్ లోని కోయిల్వార్ లో ఓ పెళ్లి సందర్భంగా బోను ఏర్పాటు చేసిన కదిలే వ్యాన్ లో ఇలా వీళ్లు డ్యాన్స్ లు వేశారు.

    ఇవీ చదవండి..

    ఓ లేడీ డాక్టర్ ముస్లిం మహిళ చెవిలో..

    కరోనా టైమ్ లో లేడీ తహశీల్దార్ చిందులు..

    ఆన్ లైన్ క్లాసులో అర్థనగ్నంగా టీచర్..

    ఆనందయ్య మందు పేరుతో డూప్లికేట్ మందుని వేల రూపాయలకు ..