భారత్ లో నేను కాలుపెడితే కరోనా పారిపోద్ది..

  0
  233

  రేప్ కేసులో పోలీసులకు చిక్కకుండా దేశం వదిలి పారిపోయిన దొంగస్వామి నిత్యానంద, ఇప్పుడు మళ్లీ వార్తల్లోకొస్తున్నాడు. ప్రస్తుతం ఈక్వెడార్ లోని ఓ దీవిలో కైలాస అనే పేరుతో తనకు తాను తనదొక దేశం అని, తాను ఆ దేశానికి అధినేతనని ప్రకటించుకున్న నిత్యానంద, భారత దేశంలో కరోనా తగ్గాలంటే తాను ఆ దేశంలో అడుగు పెట్టాల్సిందేనన్నాడు. ఈమేరకు కొత్త వీడియో రిలీజ్ చేశాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇలా వీడియోలు రిలీజ్ చేస్తూ తన ఉనికిిని కాపాడుకుంటున్న నిత్యానంద, ఇప్పుడు తాను దేశం నుంచి బయటకు రావడం వల్లే భారత్ లో అరిష్టం జరుగుతోందని, అందువల్ల తాను మళ్లీ భారత్ లో అడుగు పెడితేనే కరోనా తగ్గుతుందని తన కైలాస వెబ్ సైట్ ద్వారా చెప్పారు. ఇప్పుడు దేశంలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో తన కైలాస దేశంలోకి ఎవర్నీ అనుమతించబోమని చెప్పారు. రెండ్రోజుల క్రితం విడుదలైన ఈ వీడియోలో కొంతమంది మూఢభక్తులు దేశంలో కరోనా ఎప్పుడు పోతుందని ఆయన్ని అడిగితే అమ్మ తన శరీరంలోకి వచ్చినప్పుడు తాను భారత దేశంలో అడుగు పెడితే కరోనా శాశ్వతంగా పోతుందని చెప్పారు. అయితే నిత్యానంద భారత దేశంలో అడుగుపెడితే నారుగా జైలుకే పోతాడనే విషయం ఆయనకీ తెలుసు. బహుశా ఆయన మూఢ భక్తులకు తెలియకపోవచ్చు.

  ఇవీ చదవండి..

  నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

  ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

  అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

  నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..