కట్నం వద్దన్న వరుడు, ఒప్పుకోని వధువు ,

    0
    5387

    కట్నంకోసం అమ్మాయిలను వేధించడం, వరకట్న హత్యలు, కట్నం వేధింపులతో ఆత్మహత్యలు.. ఈ వార్తలన్నీ విన్నవారికి ఇదో కొత్తరకం వార్త. భోపాల్ లో ఓ పెళ్లికూతురు తన తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం, నగలు, డబ్బు, కారు తీసుకోనిదే తాను కాపురానికి పోనని పట్టుబట్టింది. పట్టుబట్టడమే కాదు, ఏకంగా కోర్టులో కేసు పెట్టి తన భర్త, తన తండ్రి ఇచ్చే కట్నకానుకలు తీసుకోవాలని ఈ విధంగా తన భర్తను ఆదేశించి, తాను భర్తతో కలసి కాపురానికి పోయేట్టు చేయాలని కోరింది. తన తండ్రి ఇచ్చే కట్నకానుకలు తీసుకోనిదే తాను కాపురానికి పోనని చెప్పింది. భోపాల్ లో ఆ యువతికి ఫిబ్రవరి 14న వివాహం జరిగింది.

    వివాహం రోజే, పెళ్లి కొడుక్కి కారు, 50 లక్షల రూపాయల నగదు, బంగారం, ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా తీసిచ్చి, పెళ్లి కూతురుతోపాటు పంపించారు. ఇవన్నీ చూసిన పెళ్లి కొడుకు ఇవేవీ తనకు వద్దని చెప్పాడు. అయితే పెళ్లి కూతురు మాత్రం కానుకలు లేనిదే తాను అత్తగారింటిలో అడుగు పెట్టబోనని పట్టుబట్టింది. చివరకు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. తర్వాత పెళ్లి కొడుకు ఇప్పుడు కోర్టులో కేసు దాఖలు చేశారు. తన భార్యను కట్నకానుకలు లేకండా ఇంటికి రమ్మంటే రానని, కట్నం తీసుకునే అడుగు పెడతానని చెబుతోందని, తాను వరకట్నానికి వ్యతిరేకం అని, అందువల్ల తన భార్యను తనతో కాపురం చేసేట్టు ఆదేశించాలని కోర్టులో కేసు వేశారు.

    ఆమె తెచ్చే వస్తువులు పెట్టుకునేందుకు కూడా తన ఇంట్లో చోటు లేదని, తాను పేదవాడినని, వాటిని తీసుకోలేనని చెప్పాడు. అయితే పెళ్లి కూతురు ఒప్పుకోవడం లేదని, వస్తువులకోసం పట్టుబడుతుందని చెప్పాడు. దీంతో కోర్టు పెళ్లి కూతురు తండ్రికి, పెళ్లి కూతురికి సమన్లు జారీ చేసింది. తాను సంతోషంతోనే తన అల్లుడికి కానుకలు ఇచ్చానని, అది వరకట్నం కాదని, తనకి ఒక్కతే కూతురని ఆమె సుఖంగా ఉండాలని ఇవన్నీ ఏర్పాటు చేస్తే, అల్లుడు వద్దంటున్నాడని చెప్పారు. తనను అల్లుడు ఏదీ అడగలేదని చెప్పారు. దీంతో కోర్టు భార్యా భర్తలిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలని మధ్యవర్తిని ఆదేశించింది.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.