ఎందుకీ బ్రతుకులు.. వీళ్ళిద్దరూ ఎవరో తెలుసా..?

    0
    25469

    ఎందుకీ బ్రతుకులు.. వీళ్ళిద్దరూ ఎవరో తెలుసా..?
    డబ్బు కోసం , రక్తసంబందాలు , బంధాలు కూడా మట్టికలిసిపోతున్నాయి.. ఉత్తరప్రదేశ్ ఫిరోజ్ పూర్ జిల్లా తుండ్లాలో జరిగిన ఈ ఘోరం నీచమైనదేకాదు.. డబ్బుకోసం కొంతమంది ఎంత దారుణానికైనా దిగజారుతారని చెప్పేందుకు సాక్ష్యం ,, కలికాలంలో పాపం. ఫిరోజ్ పూర్ జిల్లా నర్కి అనే గ్రామంలో ఈ పెళ్ళిపోటోలో కనిపిస్తున్న ఇద్దరూ అన్నా , చెల్లెల్లు.. వాడికి పెళ్ళై ఇద్దరు బిడ్డలున్నారు. సామూహిక వివాహాలు చేసుకుంటే యుపి ప్రభుత్వం 51 వేలు డబ్బు , పాత్రలు , పెళ్లి ఖర్చులు ఇస్తోంది. ఇందుకోసం ఈ నీచుడు చెల్లిని తీసుకుపోయి , పెళ్లికూతురని చెప్పి , డబ్బు , కానుకలు కొట్టేసాడు. ఇదొక్కటేకాదు , యుపిలో జరిగే సామూహిక పెళ్లిళ్లలో 60శాతం ఇలాంటి బోగస్ పెళ్లిళ్లే.. ఉత్తర ప్రదేశ్ లో యోగీ ప్రభుత్వం సామూహిక వివాహ యోజన అనే కార్యక్రమం చేపట్టింది.

    అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలి. సంవత్సరాదాయం 2 లక్షలు మించ కూడదు. అమ్మాయికి సొంత బ్యాంక్ అకౌంట్ ఉండాలి. వితంతువుల కూతుళ్లు, వికలాంగులు, వితంతు పునర్వివాహం, విడాకులు తీసుకున్నవారి వివాహాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇలా సామూహికంగా ప్రభుత్వం ద్వారా పెళ్లి చేసుకుంటే కొత్త జంటకు రూ. 51 వేలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. 35వేల రూపాయలు నేరుగా అమ్మాయి బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. 10వేల రూపాయల బహుమతులిస్తారు. 6వేల రూపాయలు ఆహారం, భోజనం, డెకరేషన్ కి ఇస్తారు.

    అయితే ఇలా జరిగే పెళ్లిళ్లలో అన్నీ టెంపరరీ వివాహాలేనని తేలింది. దాదాపు 60శాతం జంటలు కేవలం డబ్బులకోసమే పెళ్లి చేసుకుంటున్నాయి. పెళ్లయిన తర్వా అమ్మాయి అకౌంట్ లో పడే డబ్బుల్ని పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పంచుకుంటారు. ఆ తర్వాత ఎవరి దారి వారిదే. ఇక పెళ్లి ఖర్చులు, కానుకల కింద వచ్చే డబ్బుల్ని అధికారులు నొక్కేస్తారు. డిసెంబర్ 11వతేదీ 263మంది పెళ్లి చేసుకోగా అందులో 60శాతం ఫేక్ వివాహాలని తేలాయి.

     

    ఇవీ చదవండి

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.