తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.జర జాగ్రత్త.

    0
    182

    రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు తెలుపుతున్నాయి. ఆదివారం నుంచే మారిన వాతావరణం కారణంగా ఉత్తర కోస్తా , దక్షిణ కోస్త , రాయలసీమ , తెలంగాణాలలో ఒక మోస్తరు నుంచి వర్షాలు పడొచ్చు.. , గడచిన రెండురోజుల్లో బంగ్లాదేశ్‌ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం వాయువ్యంగా పయనించి ఆదివారం కల్లా దక్షిణ జార్ఖండ్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకా పశ్చిమతీరంలో తీరద్రోణి విస్తరించడంతో అరేబియా సముద్రం నుంచి బలమైన గాలులు మధ్యభారతం మీదుగా వీస్తున్నాయి.

    వీటి ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉత్తరకోస్తాలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఎండతీవ్రత, ఉక్కపోత కొనసాగింది. నంద్యాలలో 35.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది..

    ఇవి కూడా చదవండి..

    మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

    రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

    మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

    సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.