ప్రేయసి కోసం ఎదురుచూసి పిచ్చి వాడయ్యాడు.

  0
  108

  ప్రేమ కోసం జీవితాన్నే త్యాగం చేసాడు.. ప్రేయసి కోసం ఎదురుచూసి పిచ్చి వాడయ్యాడు.. చెప్పకుండా వెళ్ళిపోయినా ప్రేయసి తిరిగి వస్తుందని 21 ఏళ్ళు ఆమె వెళ్లిపోయిన రోడ్డుమీదనే ఉండిపోయాడు.. బహుదూరపు బాటసారి లాంటి ఓ ప్రేమికుడు. ఇదేదో సినిమా కాదు.. నవల కాదు.. నిజంగా జరిగిందే.. చెప్పకుండా వెళ్లిపోయిన ప్రియురాలికోసం 21 ఏళ్ళు ఎదురుచూసిన ప్రియుడు ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు. తమిళనాడులోని పుదుకోటై లో నాగరాజన్ అనే వ్యక్తి , కోయంబత్తూర్ లో కిరాణా దుకాణం విర్వహిస్తున్నాడు. కేరళకు చెందిన యువతిని ప్రేమించాడు. పెళ్ళిచేసుకోవాలని తీసుకొచ్చాడు. అయితే అమ్మాయి బంధువులు వచ్చి బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లారు. అప్పటినుంచి ఆ యువతికోసం ఏడేళ్లు వెదికాడు. ఆమె చెప్పిన ఊరిలో ఆమె లేదు.. చివరకు ఆమెను తీసుకుపోయిన ప్రాంతంలోనే ఉండిపోయాడు.. ఏరోజుకైనా ఆమె ఇక్కడికే వస్తుందని అక్కడే ఉండిపోయాడు.. అతడి పరిస్థితి చూసి , అక్కడే బంధువులు ఓ చిన్న పాక వేసి ఇచ్చారు.. ఆహారం పంపిస్తుంటారు.. అక్కడనుంచి ఎక్కడకీ పోడు.. వచ్చిపోయే ప్రతివాహనంలో ఆమె వస్తుందని ఎదురు చూస్తున్నాడు.. అలా చూసి , చూసి అతడికి మతిస్థిమితం తప్పింది.. ఇప్పుడతనికి 40 ఏళ్ళు.. ఈ విషయం తెలిసిన తరువాత పోలీసు , రెవెన్యూ అధికారులు , అతడిని హాస్పిటల్లో చేర్చారు..

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?