మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుందా?

  0
  70

  వంట గ్యాస్ రేట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇంతకుముందు గ్యాస్ తీసుకున్న తర్వాత సబ్సిడీ రూపంలో కొంత డబ్బు వెనక్కి వచ్చేది. ఇప్పుడు అది కూడా లేదు. ఈ దశలో మనం గ్యాస్ ను ఆదా చేసుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాల ద్వారా గ్యాస్ ఆదా చేసుకోవచ్చు. అదెలాగో చదవండి.

  – వంట చేసేటప్పుడు కావలసిన పదార్థాలు అన్నీ ఒకేసారి దగ్గరగా ఉంచుకోవాలి. లేదంటే గ్యాస్ స్టవ్ ఆన్ లో ఉంచి , ఇతర పదార్థాల కోసం వెతుకుతుంటాం. ఈ క్రమంలో గ్యాస్ ఎక్కువగా వృధా అవుతుంది.

  – స్టవ్ మీద కుక్కర్ ఉపయోగించేటప్పుడు రెండు విజిల్స్ రాగానే మంటను సిమ్ లో ఉంచుకోవడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది.

  – ఏదైనా పప్పు దినుసులను కూరగా చేయాలనుకున్నప్పుడు, ముందుగా అరగంట పాటు ఆ పప్పును నీటిలో నానబెట్టాలి. ఇక దీనిని కుక్కర్ లో వేయగానే తొందరగా ఉడకడంతో పాటు గ్యాస్ కూడా ఆదా అవుతుంది.

  – కొంతమంది ఏదైనా వంట వండేటప్పుడు , కూరలో నీళ్లు సరిపోలేదని అప్పుడప్పుడు నీళ్లు పోస్తూ ఉంటారు. అలా మధ్య మధ్యలో నీళ్లు జోడించడం వల్ల కూరగాయలు ఉడకడానికి సమయం పడుతుంది. అలాగే గ్యాస్ కూడా వృధా అవుతుంది. ఒకేసారి కూరకు ఎంత నీరు అవసరం అవుతుందో తెలుసుకుని నీళ్ళు పోయాలి. తద్వారా గ్యాస్ ఆదా అవుతుంది.

  – మరికొంతమంది కూర త్వరగా కావాలని పెద్ద మంట ఉంచి వంట చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా గ్యాస్ వృధా అవుతుంది. అలాగే కూర ఉడికిందో లేదో తెలుసుకునేందుకు మధ్య మధ్యలో మూత తీస్తూ, పెడుతూ ఉండడం వల్ల కూడా గ్యాస్ ఎక్కువగా వృధా అవుతుంది అని అంటున్నారు నిపుణులు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?