నాకు డబ్బులొద్దు సన్మానాలొద్దు..

  0
  68

  ఒలింపిక్ విజేత కావ‌డ‌మంటే సామాన్య విష‌యం కాదు. క‌ఠోర శ్ర‌మతో కూడుకున్న‌ది. అది సాధించ‌డం గొప్ప కార్యం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌న్న‌ది పెద్ద‌లు చెప్పే మాట‌. కొంద‌రు త‌మ విజ‌య‌ గ‌ర్వాన్ని త‌ల‌కెత్తుకుంటారు. మ‌రికొంద‌రు గ‌ర్వాన్ని కాలి కింద పెట్టి, నిరాడంబ‌ర‌త‌ను చాటుకుంటారు. అలాంటి వారు చాలా అరుదుగా ఉండారు. అలాంటి వారిలో చైనాకు చెందిన కున్ హోంగ్ చాంగ్ ఒక‌రు. 14 ఏళ్ళ వ‌య‌సు ఉన్న ఈ అమ్మాయి స్వ‌ర్ణ‌ప‌త‌కం సాధించింది. అయినా నిరాడంబ‌ర‌త‌కు నిలువెత్తు నిర‌ద‌ర్శ‌నంగా నిలిచింది.

  ఒలింపిక్స్ లో ఏ చిన్న మెడ‌ల్ గెలిచినా మ‌న‌వాళ్ళు ముఖ్య‌మంత్రిని, ప్ర‌ధానిని క‌లిసి కోట్ల‌కు కోట్లు న‌గ‌దు అవార్డులు, రివార్డులు స్వీక‌రిస్తారు. కార్పోరేట్ సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాజిడ‌ర్లుగా వ్య‌వ‌హిరిస్తూ కోట్లు గ‌డించేస్తూ, దాన్ని ఒక వ్యాపారంగా మార్చుకుంటున్న సంద‌ర్భాలూ ఉన్నాయి. ఇలాంటి త‌రుణంలో టోక్యో ఒలింపిక్స్ లో డైవింగ్ విభాగంలో గోల్డ్ మెడ‌ల్ సాధించిన 14 ఏళ్ళ కున్ హోంగ్ చాంగ్ అనే అమ్మాయి… త‌న‌కు వ‌చ్చిన న‌గ‌దు బ‌హుమతులు అన్నింటినీ వెన‌క్కి ఇచ్చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

  ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన న‌జ‌రానా స‌హా ఎన్నో కార్పోరేట్ సంస్థ‌లు ప్ర‌క‌టించిన అవార్డులు, రివార్డుల‌ను సున్నితంగా తిర‌స్క‌రించింది. అప్ప‌టివ‌ర‌కు చాలా సంస్థ‌లు ప్ర‌క‌టించిన న‌గ‌దును, ఆస్తులు, భ‌వ‌నాల‌ను తాను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేసింది. త‌న‌ను అభినందించేందుకు త‌న గ్రామానికి ఎవ‌రూ రావొద్ద‌ని.. సోష‌ల్ మీడియా ద్వారానే త‌న‌కు అభినంద‌న‌లు తెలిపితే స‌రిపోతుంద‌ని విన్న‌వించింది. దీంతో ఆ గ్రామానికి సంద‌ర్శ‌కుల రాక‌ను నిలిపివేస్తూ అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప‌రుల‌ను ఎవ‌రినీ గ్రామంలోకి రానివ్వ‌డం లేదు.

  చైనా దేశం గాండాంగ్ రాష్ట్రంలో మైహి అనే గ్రామంలో కున్ హోంగ్ చాంగ్ నివ‌సిస్తోంది. ఆ గ్రామంలోకి ఆమె కోరిక మేర‌కు సంద‌ర్శ‌కుల ఎవ‌రినీ అనుమ‌తించ‌క‌పోవ‌డంతో, గ్రామ స‌రిహ‌ద్దుల్లోనే సంద‌ర్శ‌కులు, అభిమానులు హంగామా చేస్తున్నారు. డ‌ప్పులు వాయిస్తూ, ట‌పాసులు పేలుస్తూ త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ హంగామాతో ఆ గ్రామ‌స్తుల‌కు కంటి మీద కునుకు క‌రువైంది. ఈ నేప‌ధ్యంలో ఆమె కుటుంబం కూడా ఒక బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేస్తూ త‌న కోసం ఎవ‌రూ రావొద్ద‌ని, త‌మ‌కు బ‌హుమ‌తులు ఇవ్వొద్ద‌ని, ప్ర‌కటించొద్ద‌ని, ఒక‌వేళ ఇచ్చినా తీసుకోమ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో సంద‌ర్శ‌కులు, అభిమానులు తెచ్చిన బ‌హుమ‌తుల‌ను గ్రామం బ‌య‌టే వ‌దిలి వెళ్ళిపోతున్నారు. కున్ హోంగ్ చాంగ్ అభిమ‌తం మేర‌కు ప్ర‌భుత్వం కూడా ఎలాంటి అభినంద‌న స‌భ ఏర్పాటు చేయ‌లేదు. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడ‌ల్ సాధించి దేశానికి కీర్తి తేవ‌డ‌మే త‌న క‌ర్త‌వ్య‌మ‌ని, అవార్డులు రివార్డులు అవ‌స‌రం లేద‌ని తెలిపింది. ప‌ది మీట‌ర్ల ప్లాట్ ఫామ్‌ డైవింగ్ విభాగంలో ఆమె స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచింది. అనారోగ్యంతో ఉన్న త‌న‌ త‌ల్లికి ఈ మెడ‌ల్‌ను అంకితం చేసింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?