బిడ్డకోసం కిడ్నాపర్ తో ఫైట్ చేసిన తల్లి..

  0
  7119

  కళ్లముందే బిడ్డను ఎవరైనా కిడ్నాపర్ వచ్చి లాక్కెళ్తుంటే తల్లి ఏంచేస్తుంది. భయపడి అరుస్తుంది, చుట్టుపక్కలవారిని పిలిచి కాపాడాలని వేడుకుంటుంది. కానీ ఆ తల్లి మాత్రం ధైర్యం చేసింది, ఏకంగా కిడ్నాపర్ నే బోల్తా కొట్టించి మరీ తన కొడుకుని కాపాడుకుంది. ఈ ఘటన న్యూయార్క్ లోని రిచ్ మండ్ హిల్ ఏరియాలో జరిగింది.

  ఐదేళ్ల కొడుకుతో కలసి తల్లి, ఆమె స్నేహితురాలు షాపింగ్ కి వచ్చారు. రోడ్డుపై నడుచుకుని వెళ్తుండగా.. బిడ్డ కాస్త ముందుగా ఆడుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో సడన్ గా వచ్చిన ఓ కిడ్నాపర్ పిల్లవాడిని బలవంతంగా ఎత్తుకుని వెళ్లిపోయాడు. అక్కడే పార్క్ చేసిన కారులో వెనుకవైపు వేసి, తాను డ్రైవింగ్ సీట్లోకి వెళ్లబోయాడు. అక్కడినుంచి స్పీడ్ గా కారు డ్రైవ్ చేసుకుని వెళ్లేందుకు రెడీ అయ్యాడు. అయితే అంతలోనే అప్రమత్తమైన తల్లి, ఆమె స్నేహితురాలు బిడ్డను కాపాడుకోడానికి సాహసం చేశారు. కారు వెనుక సీట్లో పిల్లవాడిని కూర్చోబెట్టి, కిడ్నాపర్ ముందు సీట్లోకి వెళ్లే లోపే మరో వైపు డోర్ తీసి పిల్లాడిని బయటకు లాగేశారు. సమయస్ఫూర్తి ప్రదర్శించి బిడ్డను కాపాడుకున్నారు. ఈలోగా స్థానికులు ఆ కిడ్నాపర్ ని పట్టుకునే ప్రయత్నం చేయగా వాడు అక్కడినుంచి పారిపోయాడు. అంతకు ముందు ఆ కిడ్నాపర్ ఎక్కడెక్కడ తిరిగాడు అనే వివరాలను కూడా సీసీ టీవీ ఫుటేజీ నుంచి పోలీసులు సంపాదించారు. వాడికోసం వేట మొదలు పెట్టారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?