రేంజ్ రోవర్ కారు హైజాక్ చేసి , రైలు పట్టాలపై డ్రైవ్ చేసుకుంటూ ..

  0
  4195

  వీడు గజ దొంగ‌.. లేక ఘరానా దొంగ‌… తెలియ‌దు కానీ… ఏకంగా పోలీసుల కారునే ఎత్తుకెళ్ళారు. ఎత్తుకెళ్ళి నేరుగా రైల్వే ట్రాక్ ఎక్కించేసి , ట్రైన్ లాగానే పట్టాలపై కారు పరుగులు తీయించాడు. తర్వాత పట్టాల మీద వ‌దిలేసి ఎంచ‌క్కా చెక్కేశాడు. లండ‌న్‌లో ఈ వింత చోరీ జ‌రిగింది. పోలీసుల‌కు చెందిన రేంజ్ రోవ‌ర్ కారును ఓ అగంత‌కుడు ప‌బ్లిక్ గానే హైజాక్ చేశాడు. కారు ప‌క్క‌నే ఉన్న‌పోలీసును తోసేసి మ‌రీ హైజాక్ చేశాడు. అయితే ఇత‌న్ని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు చేజింగ్ చేశారు. అయినా ఈ దొంగోడు సినీఫ‌క్కీలో కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఏకంగా చెస్స‌న్ రైల్వేస్టేష‌న్ లో ట్రాక్ పైకి ఎక్కించేశాడు. అలాగే ట్రాక్ మీద కారును డ్రైవ్ చేస్తూ ముందుకెళ్ళాడు. అయితే కొంత‌దూరం వెళ్ళాక రైళ్ళు వ‌స్తుండ‌డాన్ని గుర్తించి, అక్క‌డే కారును వ‌దిలేసి ద‌ర్జాగా వెళ్ళిపోయాడు. కారు ట్రాక్ పై ఉండ‌డానికి గుర్తించి, అధికారులు రైళ్ళ‌ను నిలిపివేశారు.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?