నోటిదూల బాబా , ఇదేమి నీతి..

  0
  135

  ఒక్కో దఫా మాటలు మార్చడంలో రాజకీయ నాయకుల కంటే రాజకీయ స్వాములు , రాజకీయ ఆధ్యాత్మిక వేత్తలు ముందుంటారు.. అబద్దాలు చెప్పడంలో వాళ్ల ముందు రాజకీయ నాయకులు కూడా పనికిరారు . రాజకీయాలు చేయడంలో గానీ సంపాదనలో గానీ ఈ పొలిటికల్ స్వాములు అగ్రస్థానంలో ఉంటారు. అటువంటి వారిలో యోగా గురువు రాందేవ్ బాబా ఒకరు. పతంజలి ఆయుర్వేద సంస్థని అడ్డంపెట్టుకుని ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ,ఏడాదికి దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తుంటాడు . కింద స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కరోనా నివారిణి అనిచెప్పి నాసిరకం మందు అమ్మి 70 వేల కోట్లు రూపాయలు సంపాదించాడు. ఇలా ఆధ్యాత్మిక వేత్త ముసుగులో అడ్డంగా వ్యాపారాలు చేస్తూ రాందేవ్ బాబా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు ..

  అదేంటంటే గతంలో అంటే 2014 లో 40 రూపాయలుకి పెట్రోలు, 300 రూపాయలుకి వంట గ్యాస్ ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నికోవాలని కోరాడు. పదే పదే ఇదేమాట సభలలో , మీడియాలో చెప్పేవాడు. అయితే ఇప్పుడు జరిగిన మీడియా సమావేశంలో గతంలో మీరు నలభై రూపాయలకి పెట్రోల్ 300 రూపాయలు ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు కదా ఇప్పుడు గ్యాస్ ధరలు మాటేమిటి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు మాటేమిటి అని విలేకరి అడిగితే నోరు మూసుకొని కూర్చో , నా ఇష్టం నేను ఎలాగైనా మాట్లాడతాను అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు..

  అదేమిటి స్వామి గతంలో మీరు మాట్లాడిన మాటలు అన్నీ మేము ఇప్పుడు గుర్తు చేస్తున్నాము , ఇప్పుడున్న పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలపై ఏమి వ్యాఖ్యానిస్తారు అని అడిగితే , గవర్నమెంట్ అన్న తర్వాత ఖర్చులు ఉంటాయని ధరలు పెరుగుతున్నా మనం భరించాల్సిందే అని ఒక ఉచిత సలహా పారేసాడు. పెరిగిన ధరలను పట్టించుకోకుండా ప్రజలు కూడా కష్టపడి పనిచేయాలని , తాను ఆధ్యాత్మికవేత్త అయినా వేకువనే నాలుగు గంటలకు లేచి రాత్రి పది గంటల వరకు పని చేస్తానని చెప్పాడు. అయితే ఇదంతా ఆయన తన కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు అని అందరికీ తెలిసిందే..

  దీంట్లో మరో కొసమెరుపేమిటంటే రాందేవ్ బాబాకి గతంలో ఆయన గ్యాస్ , పెట్రోల్ ధరలపై చెప్పిన మాటల గురించి అడుగుతున్నప్పుడు , ఆయన వెనుక ఉన్న ఆయన శిష్యులైన అమ్మాయిలు అభ్యంతరం చెప్పడం మరో కోసమెరుపు., ఇటీవల కాలంలో అటు ఇటుగా ఆయనకు స్వామిని లు ఉండడం విశేషం. అన్ని జబ్బులకు తన పతంజలి మందులే అమృతగుళికలని చెప్పే రాందేవ్ బాబా , ఆయన కంపెనీ సిఇఓ బాలకృష్ణ మాత్రం కరోనా జబ్బుకి , బిపికి , షుగర్ కి ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స తీసుంటాడు..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.