టిటిడి బోర్డులో క్రిమినల్స్ ని తీసేయండి.. హైకోర్టు ఆదేశం.

    0
    245

    టీటీడీకి షాకిచ్చిన హైకోర్టు..

    అలాంటి సభ్యులు ఇకపై గోవిందా..!

    టీటీడీ పాలకమండలిలో కొందరు సభ్యులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం వంటి పవిత్రమైన క్షేత్రం ధర్మకర్తలుగా నేర చరిత్ర ఉన్నవారిని ఎలా నియమిస్తారంటూ వ్యాఖ్యానించింది. దేవుని సేవలో ఉన్నవారికి నేర చరిత్ర ఉండవచ్చా..? అసలు వారిని టీటీడీ సభ్యులుగా ఎలా నియమిస్తారంటూ ప్రశ్నించింది. వారివలన మీకేదైనా ప్రయోజనం ఉందా.. అలా ప్రయోజనం ఉండటం వలనే మీరిలా చేస్తున్నారా..? అని కూడా ప్రశ్నించింది.

    బీజేపీ నాయకుడు టీటీడీ మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రధాన ధర్మాసనం, ఈ వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్ తరపున న్యాయవాది చేసిన దాఖలు చేసిన పిటిషన్ లో వాస్తవం ఉన్నట్టు ప్రాధమికంగా తాము ఒక అంచనాకు వచ్చామని, అందువలన అలాంటి వారిని తొలగించమని ఆదేశాలు కూడా జారీ చేసింది. అందరినీ తొలగించ లేకపోయినా.. అలాంటి నేరచరిత్ర కలిగిన వారిని తొలగించాలని కూడా ఆదేశించింది.

    క్రిమినల్ రికార్డు కలిగి టీటీడీ సభ్యులుగా వున్నవారిని ఏప్రిల్ 19వ తేదీలోగా ప్రభుత్వం తొలగించాలంటూ ఆదేశించింది. టీటీడీ బోర్డులో 14 మంది సభ్యులకు నేరచరిత్ర ఉందని, అందులో నలుగురు రాజకీయ నేరగాళ్ళని.. భాను ప్రకాష్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. చాలా మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. కొందరు తమ వివరాలను తెలిపే అఫిడవిట్ లను కూడా దాఖలు చేయలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ సీరియస్ గా తీసుకున్న హైకోర్టు 19వ తేదీలోగా తీవ్రమైన కేసులున్నవారిని తొలగించాలని సూచించింది. మళ్ళీ కేసు విచారణను 19వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆ రోజు కూడా తీర్పులో ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించింది.

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో.