సంచలనం సృష్టించిన బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నాష్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. ఈనెల 9న సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై రాజు హత్యాచారం చేశాడు. ఈ ఘటన తర్వాత రాజు పారిపోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు కూడా తీవ్రంగా గాలించారు. రాజుని పట్టించినవారికి 10లక్షల రివార్డు కూడా ప్రకటించారు. సోషల్ మీడియాలోనూ నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని నిరసనలు వెల్లువెత్తాయి.
అయితే అకస్మాత్తుగా ఈ తెల్లవారుజామున రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ నీచుడు కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. హైదరాబాద్ టాస్కఫోర్స్ అదుపులో నిందితుడు రాజు స్నేహితుడు దొరికాడు.పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా రాజు ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. అయితే రాజుకు తోడుగా ఎల్బీనగర్ వరకు అతడి స్నేహితుడు వచ్చాడు. సీసీ ఫుటేజ్‌లో అతడు కూడా కనిపించాడు. అనంతరం ఎల్బీనగర్ నుంచి రాజు ఒంటరిగా వెళ్లారు. అయితే పారిపోయే ముందు రాజు ఎల్బీనగర్‌లో ఆటో దొంగతనానికి యత్నించాడు. ఆటో డ్రైవర్ అప్రమత్తతో రాజు పరారయ్యాడు. అక్కడి నుంచి నాగోల్ వరకు బస్సులో వెళ్లాడు. నాగోల్‌లోని ఓ వైన్ షాప్ వద్ద మద్యం సేవించి అటు నుంచి బస్సులో ఉప్పల్ వెళ్లాడు. అక్కడి నుంచి ఘట్‌కేసర్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. చివరకు ఏమైతేఏమి , ఎట్లా చస్తే ఏమి , రైల్వే ట్రాక్ మీద శవం అయ్యాడు.. ఓ కిరాతకుడు కధ అలా ముగిసింది..
ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక పోలీసులే చంపారా అనే విషయం కూడా ఇక్కడ అనవసరం.. ఎందుకంటే చిన్నారికి జరగాల్సిన న్యాయం తెలంగాణ పోలీసులు చేసేశారు. అయితే ఈ సారి తెలంగాణ పోలీసులు కాస్త కొత్తగా ఆలోచించారు. ఎన్ కౌంటర్ చేస్తే.. మానవహక్కుల ఉల్లంఘన కింద విచారణ జరుగుతుందని అనుకున్నారో.. ఏమోగానీ సైలెంట్ గా పని పూర్తి చేశారు. చిన్నారి చైత్రకి న్యాయం చేశారు. బహుశా ఆ చిన్నారి ఆత్మకూడా పైనుంచి చూసి సంతోషపడి ఉంటుందేమో..