చైనా కు చెందిన వివో స్మార్ట్ ఫోన్ కంపెనీ, దాని అనుబంధ కంపెనీలపై ఈడీ దాడులు చేసింది. ఈ సంస్థపై తీవ్రమైన ఆర్థికనేరాల ఆరోపణలు రావడంతో.. ఈడీ రైడ్ చేసింది. భారత ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులను ఎగవేయడంతో పాటు నష్టాలను చూపించినట్లు ఈ దాడుల్లో తేలింది.
చైనాకు చెందిన వివో మొబైల్ కంపెనీ భారతదేశంలో విస్తృత కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎన్నో బ్రాంచ్‌లు ఓపెన్ చేసింది. వందల లక్షల కోట్ల మేర ఆర్జించింది. అయితే వాటిలో ట్యాక్సులు కట్టకుండా పంగనామం పెట్టింది. వాస్తవ లెక్కలను దాచిపెట్టి, తప్పుడు లెక్కలతో వందల కోట్ల మేర పన్ను ఎగవేతలకు పాల్పడింది. ఈ కంపెనీలో షేర్స్ పెట్టిన షేర్ హోల్డర్స్ నష్టాలను చూపించారు. అనుమానంతో షేర్ హోల్డర్స్ ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు వివో సంస్థ, అనుబంధ సంస్థలపై దాడులు నిర్వహించింది.
దేశవ్యాప్తంగా 48 నగరాల్లో వీటి కార్యకలాపాలపై ఆరా తీసింది. సోదాలు చేసింది. ఈ సంస్థకు చెందిన 119 బ్యాంక్ అకౌంట్లు, దాదాపు 525 కోట్ల రూపాయలను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఇండియాకి కట్టాల్సిన ట్యాక్సులను ఎగవేసి.. చైనా దేశానికి 62 వేల 476 కోట్ల ట్యాక్స్ కట్టింది వివో సంస్థ. ఇది ఇండియా టర్నోవర్‌లో 50 శాతం అన్నమాట. ఇండియాలో తమ సంస్థకు నష్టాలు వచ్చాయని, తప్పుడు లెక్కలు చూపించి, ట్యాక్స్ ఎగవేతకు పాల్పడింది. వివో సంస్థ ఇంతటి భారీ కుంభకోణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది.