భార్యను ఫ్రెండ్స్ తో అలా.. వ్యాపారి అరెస్ట్.

  0
  991

  భార్య‌ల‌ను మార్చుకునే సంస్కృతి మెట్రో న‌గ‌రాల్లో విచ్చ‌ల‌విడిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. బాంబే, బెంగుళూరు, హైద‌రాబాద్, కోల్ క‌త్తా, ఢిల్లీ వంటి మ‌హాన‌గ‌రాల్లో ఈ వికృత నాగ‌రిక‌త ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వార్త‌లొస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఓ వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య‌ల‌ను మార్చుకునే స్వాపింగ్ పార్టీలో అత‌డు భార్య‌ను ఒత్తిడి చేయ‌డంతో.. ఆమె ఫిర్యాదు మేర‌కు, పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి త‌ర‌లించారు.

  ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త అయిన ఈ వ్య‌క్తి భార్య‌ల‌ను మార్చుకునే ప్రాంతానికి త‌న భార్య‌ను తీసుకెళ్ళాల‌ని ప్ర‌య‌త్నం చేసి విఫ‌ల‌మ‌య్యాడు. ప‌లుమార్లు ఆమెపై దాడి చేశాడు. దీంతో అత‌డి భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇదే వ్యాపారి చాలాసార్లు త‌న సోద‌రుడితో సంబంధం పెట్టుకోవాల‌ని భార్య‌ను ఒత్తిడి చేశాడు. ఈ విష‌యంలో కుటుంబస‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు చెల‌రేగాయి. భ‌ర్త వేధింపులు భ‌రించ‌లేక ఆ వ్యాపారి భార్య‌, పోలీసుల‌కు ఫిర్యాదు చేసి, నేరుగా కోర్టులో కూడా పిటీష‌న్ దాఖ‌లు చేసింది.

  గ‌తేడాది జూన్‌లో వీరికి పెళ్ళ‌యింది. భ‌ర్త‌తో గురుగ్రామ్‌కు వెళ్ళి అక్క‌డే కాపురం ఉంది. పెళ్ళ‌యిన వారం రోజుల నుంచే త‌న‌ను త‌న సోద‌రుడితో సంబంధం పెట్టుకోమ‌ని, భార్య‌ల‌ను మార్చుకునే పార్టీల‌కు తీసుకెళ్ళాల‌ని వేధించ‌డం మొద‌లు పెట్టాడ‌ని, ఈ విష‌యం ఎవ‌రికైనా చెబితే చంపుతాన‌ని బెదిరించేవాడ‌ని తెలిపింది. దీంతో ఆ వ్యాపారి మీద అత్యాచారం, హ‌త్యా ప్ర‌య‌త్నం వంటి కేసులు న‌మోదు చేశామ‌ని పోలీసులు చెప్పారు.

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.