రాధేశ్యామ్ సినిమా హిట్ అని కొందరు, ఫ్లాప్ అని మరికొందరు అంటున్నారు. మొత్తమ్మీద మిక్స్ డ్ టాక్ రావడంతో సినిమా గురించి తలోరకంగా మాట్లాడుకుంటున్నారు. కానీ నిర్మాతలు మాత్రం సినిమాకి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయంటున్నారు. ఫస్ట్ డే కలెక్షన్లు, రెండ్రోజుల కలెక్షన్లు, మూడు రోజుల కలెక్షన్లు అంటూ రికార్డులు ప్రకటిస్తున్నారు. తాజాగా మూడు రోజుల కలెక్షన్లపై నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ లెక్కలు బయటపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు 151 కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చిందని తెలిపింది నిర్మాణ సంస్థ.
A phenomenal response for #RadheShyam on the big screen with 151 cr gross in 3 days worldwide.#BlockBusterRadheShyam ❤️
Book your tickets now on @paytmtickets!https://t.co/Dr28SLfkza#Prabhas @hegdepooja @director_radhaa pic.twitter.com/ManQvzyZbn
— UV Creations (@UV_Creations) March 14, 2022