19 వేల కిలోమీటర్లు నాన్ స్టాప్ విమానం ..

    0
    81

    విమానయాన చరిత్రలో ఇంతవరకూ కనీవినీ ఎరుగని విమానాన్ని కొనుగోలు చేసేందుకు కాంటాస్ ఎయిర్ వేస్ నిర్ణయం తీసుకుంది . వీటి కోసం బోయింగ్ కి ఆర్డర్ పెట్టింది. 2025 సంవత్సరానికి ఇది సిద్ధం కానుంది. ఒకే దఫా ఆగకుండా 19 గంటల పాటు ఈ విమానం ప్రయాణం చేస్తుంది. మొట్టమొదటిగా సిడ్నీ నుంచి లండన్ కి ఈ విమానాన్ని నడుపుతారు . దాదాపు ఐదేళ్ల ప్రణాళిక తర్వాత ఇది సిద్ధం కాబోతోంది. ఇంతవరకు ఇటువంటి పన్నెండు విమానాల కోసం ఆస్ట్రేలియా ఆర్డర్ పెట్టింది.

    ప్రాజెక్ట్ సన్ రైజ్ పేరుతో మొదలుకానున్న ఈ విమానం మొదట సిడ్నీ నుంచి లండన్ కి తరువాత లండన్ నుంచి న్యూయార్క్ వరకు నడుపుతారు. 19 గంటల పాటు 17840 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణం చేసే విధంగా దీన్ని రూపొందించారు. ఇంతవరకు సింగపూర్ మాత్రమే ఏకధాటిగా 16 వేల కిలోమీటర్లు పోయే విమానాన్ని నడుపుతోంది . ఇదే ఇప్పటివరకు సుదీర్ఘమైన ఫ్లైట్ గా ఉంది .

    ఇప్పుడు 19 గంటల పాటు ప్రయాణం చేసే ఈ విమానంలో 238 మంది ప్రయాణికులఅందరికీ ఫస్ట్ క్లాస్సూట్స్ ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకమైన బెడ్ , చిన్న ఛాంబర్ అన్ని ఉంటాయి . అన్ని రకాల సౌకర్యాలతో తయారు కానున్న ఈ విమానంలో చార్జీలు కూడా మామూలు విమానం కంటే రెండింతలు ఉండపోతాయి. 2034 ఇలాంటి విమానాలను 94 విమానాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు . కరోనా లాంటి అంటువ్యాధులు ప్రబలిప్పటికీ ,ఈ విమానాల్లో ప్యాసింజర్ కు సపరేట్ గా చాంబర్లు ఉండటంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా చాలా తక్కువ అని దాదాపుగా ఉండవు అని కూడా అంటారు .

     

    ఇవీ చదవండి… 

    బుల్లెట్ బండెక్కి వచ్చింది పాప .. సూపర్..

    మెగా ఫ్యామిలీకి ఏమిటీ శాపం..నాగబాబుకు ఇక నోరెత్తలేని పరిస్థితి.

    ఎమ్మెల్యే మేకపాటి రెండో భార్య శాంతమ్మ మాటలు వెనుక అసలు కథేమిటో చూడండి.. ??

    ఆత్మకూరు నర్సు , ఒక ప్రియుడితో మరో ప్రియుడిని కారుతో ఢీకొట్టించి ఎలా చిక్కిందో చూడండి.