వికలాంగులనే టార్గెట్ చేస్తుంది.. పెళ్లి పేరుతొ ముంచేస్తుంది..

  0
  5412

  ఈమె పేరు మేఘ.. 30 ఏళ్ళ వయసు. మహా మాయలాడి , ఇప్పటివరకు 12 పెళ్లిళ్లు చేసుకుంది.. నాలుగుసార్లు జైలుకు పోయింది.. బెయిల్ పై బయటకు వచ్చినప్పుడల్లా పెళ్లిచేసుకుంటుంది.. కొంతకాలం కాపురంచేసి , ఇంట్లో నగలు , డబ్బుతో పారిపోతుంది.. అయితే ఈమెలో స్పెషాలిటీ ఉంది.. పెళ్లికొడుకులను ఎన్నుకునేప్పుడు , వికలాంగులనే టార్గెట్ చేస్తోంది.. డబ్బుండి , మూగ , కాళ్ళు , కళ్ళు లేనివాళ్లనే టార్గెట్ చేస్తుంది. ఇందుకోనం దేవేందర్ అనే ఒక బ్రోకర్ ఉంటాడు.. అతడే అలాంటివాళ్ళకోసం గాలం వేస్తుంటాడు. మేఘ ఇండోర్ కి చెందిన మహిళే అయినా , డబ్బుండి , వికలాంగులైన వాళ్లకు , పిల్లనిచ్చేనందుకు ఎవరూ ముందుకురారుకాబట్టి వాళ్లనే టార్గెట్ చేస్తారు. నగలు , డబ్బు తీసుకొని ఇంటినుంచి పారిపోయినా , పెద్దగా పట్టించుకోరు , ఒక వేళ పట్టించుకున్నా , వరకట్న వేధింపులకేసులు పెడతారు.. అయితే ఇటీవల మేఘ , కేరళలోని వైటిల్ల లో లెనిన్ జితేంద్ర , అనే మూగ వ్యక్తిని పెళ్లాడింది.. నెల రోజులకే 10 లక్షలతో బిచాణా ఎత్తేసింది. పోలీసులు విచారణలో , మేఘ పెళ్ళిళ్ళ చీటింగ్ బయటపడింది. దీంతో కోర్టు మేఘకు నాలుగేళ్ళ జైలు శిక్ష , 9 లక్షలు జరీమానా విధించింది..

   

  ఇవీ చదవండి

  బైక్ ఫీట్స్ అమ్మాయిలే సూపర్ గా ..

  కూతురి తలను నరికి సెల్ఫీ తీసుకున్న తల్లి.

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.