మన రాష్ట్ర ప్రభుత్వం పెద్ద బ్రాండ్ల మద్యం పెంచేసి కొత్తగా వచ్చిన బ్రాండ్ల రేట్లు తగ్గించి ఆదాయం పెంచుకోవాలని చూస్తుంటే.. పంజాబ్ రాష్ట్రం దీనికి భిన్నంగా ఆలోచించి… ఎక్సైజ్ శాఖ ఆదాయాన్ని వందల కోట్లకు పెంచేసింది. విదేశీ మద్యంతో సహా భారతదేశంలో తయారయ్యే అన్ని మద్యం బ్రాండ్లపై పన్నులు రద్దు చేసి ధరలు బాగా తగ్గించింది.
దీంతో మందుబాబులు ఎక్కువ మందు తాగేసి.. ఆదాయం కూడా ఎక్కువ తెచ్చిపెడతారనేది ఆ ప్రభుత్వ వ్యూహం. ఇప్పుడు ఆ ఆలోచన ఫలించింది. ఒక్క నెల రోజులకే 600 కోట్ల అదనపు ఆదాయాన్ని సంపాదించి పెట్టింది. పంజాబ్ లో కేంద్రపాలిత ప్రాంతం చండీఘర్, పక్క రాష్ట్రమైన హర్యానాలో మద్యం రేట్లు చాలా తక్కువ. అందువల్ల పంజాబ్ మందుబాబులు ఎక్కువగా పంజాబ్ నుంచి మందు తెచ్చుకుంటారు.
దీంతో పరిస్థితిని గమనించి, వాటి కంటే తక్కువగా మద్యం రేట్లు పెట్టారు. దీంతో 25 నుంచి 60 శాతం వరకు మద్యం రేట్లు తగ్గిపోవడంతో ఇప్పుడు పంజాబ్‌లో క్వార్టర్ తాగేవాడు హాఫ్ తాగుతున్నాడు. బీర్ ధరలు కూడా విపరీతంగా తగ్గించింది. ప్రస్తుతం ఏడాదికి 2600 కోట్లు ఉన్న ఆదాయం 10 వేల కోట్లకు పెంచాలన్నది వారి ఆలోచన. ఒక్క నెలలో చూస్తే ఇదేం పెద్ద కష్టం కాదు. 10 వేల కోట్లకు మించిపోతుందని కూడా అంచనా వేస్తున్నారు.