సుజుకీ కొత్త కారు..మైలేజీ 31 గ్యారంటీ.. బుకింగ్స్ ఎప్పుడంటే..?
రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలకు వాహన దారుల జేబులకు చిల్లుపడక తప్పడం లేదు. టూ వీలర్ కి పెట్రోల్ కొట్టించాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇక కార్ల యజమానుల కష్టాలు చెప్పనవసరం లేదు.
.
ఏదో కాస్త హోదా కోసం కార్లు కొనుగోలు చేసిన చాలా మంది, ఇప్పుడు పెట్రోల్ బాధలు భరించలేక తమలో తాము కుమిలి పోతున్నారు. కొన్న కార్లు అమ్మలేక, అటు పెట్రోల్ రేట్లు భరించలేక సతమతమయిపోతున్నారు.ఈ నేపథ్యంలో సుజుకీ కంపెనీ ఒక శుభవార్త చెప్పింది. త్వరలోనే లాంచ్ చేయనున్న ఓ కారు 31 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని ప్రకటించింది. ఇప్పటికే ఈ కారును జపాన్ మార్కెట్లోకి విడుదల చేశారు.
ఈ కారు పేరు ఆల్టో లాపిన్.. 660 సీసీ ఇంజిన్ తో ఈమొదెల్ ను తయారు చేశారు. పూర్తిగా రెట్రో స్టైల్ లుక్స్ కలిగి ఉండటం ఈ కారు ప్రత్యేకత.. సుజుకి కంపెనీ ఈ లాపిన్ కారును త్వరలోనే భారత్ లోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఫ్రంట్ వీల్ తో పాటుగా ఆల్ వీల్ డ్రైవ్ కూడా ఈ కారు కలిగి ఉంది. ఈ లాపిన్ కారులో బేసిక్ వెర్షన్ మోడల్ 5,62,000 ధర కాగా.. ప్రీమియం మోడల్ 6,15,000 గా చెబుతున్నారు. మొత్తానికి ఈ కారు కనుక భారత్ లోకి అందుబాటులోకి వస్తే మధ్యతరగతి ప్రజలు మరింతగా, తమ కారు కలను నెరవేర్చుకుంటారు.