రాబందుల రెక్కల్లో దాగిన ట్రాన్స్మిటర్..

    0
    115

    ఇదేంటో తెలుసా ? దీన్ని ”ప్లాట్ ఫామ్ ట్రాన్స్ మీట‌ర్ టెర్మిన‌ల్” (PTT)అంటారు. దీన్ని అంత‌రించి పోతున్న ప‌క్షులు, జంతువుల‌కు అమ‌రుస్తారు. దీన్ని అమ‌ర్చిన జంతువులుగానీ, ప‌క్షులుగానీ ఎక్క‌డున్నా వాటి స‌మాచారం తెలిసిపోతుంది. ప్ర‌త్యేకంగా రూపొందించిన ఈ PTT రాబందుల‌కు అమ‌రుస్తారు. ఈ PTT నుంచి రాబందుల ఉనికి, అవి తిరిగే ప్ర‌దేశాలు అన్నీ కూడా శాటిలైట్ ద్వారా ట్రాక్ చేస్తారు. ఇందులో అతి సూక్ష్మ‌మైన సోలార్ ప్యాన‌ల్స్ ఉంటాయి.

    ఈ సోలార్ ప్యాన‌ల్స్ ద్వారానే దీనిలో బ్యాట‌రీ రీచార్జ్ అవుతుంటుంది. వీటి డేటా ట్రాన్స్ మీట్ చేసేందుకు అబ్రోస్ శాటిలైట్ ను వాడుకుంటారు. ఇంత‌కీ రాబందుల విష‌యంలో ఇంత ర‌చ్చ‌, జాగ్ర‌త్త ఎందుకు అని అనుకోవ‌చ్చు. రాబందులు అంత‌రించిపోతే దాని వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి తీవ్ర‌మైన ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. రాబందుల్ని ఫారెస్ట్ స్కావెంజ‌ర్స్ అంటారు. అంటే అడ‌విని ప‌రిశుభ్రంగా ఉంచ‌డంలో రాంబందుల పాత్ర కీల‌కం.

    చ‌నిపోయిన జంతు క‌ళేబ‌రాల‌ను తిని.. అవి కుళ్ళి వైర‌స్‌లు, బ్యాక్టీరీయాలు వ్యాపించ‌కుండా చేయ‌డంలో ఇవి ప్ర‌ధాన పాత్ర వ‌హిస్తాయి. రాబందులు లేక‌పోతే అడ‌వి జంతువుల మ‌ర‌ణాలు కూడా ఎక్కువే ఉంటాయి. అందువ‌ల్ల అట‌వీ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు రాంబందులు అత్యంత అవ‌స‌ర‌మైన ప‌క్షులు. అంత‌ర్జాతీయంగా రాబందుల ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక సంస్థ కూడా ఉంది.

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..