125 ఏళ్ళ శివానంద , రాష్ట్రపతి భవన్లో ఇలా మోకరిల్లి..

    0
    215

    ఎవరీ స్వామి శివానంద యోగి…? రాష్ట్రపతి భవన్ లో పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవంలో , స్వామి శివానంద యోగి అవార్డు తీసుకునే సమయంలో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. పద్మశ్రీ అవార్డు కోసం రాష్ట్రపతి భవన్లో స్వామి శివానంద పేరు చెప్పగానే చప్పట్లు మారుమ్రోగాయి . స్వామి శివానంద అవార్డు తీసుకునేందుకు పోతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎదురుగా మోకరిల్లారు. ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురైన ప్రధాని లేచి ఆయన ముందు రెండు సార్లు మోకరిల్లారు.

    ఆ తర్వాత స్వామి శివానంద యోగి రాష్ట్రపతి వద్దకు పోతూ రెండుసార్లు మోకరిల్లారు.. రాష్ట్రపతి భవనంలో సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్రపతి ఒక మెట్టు దిగి స్వామి శివానందని , పలకరించి పద్మశ్రీ అవార్డును ప్రధానం చేశారు, ఆయనకి ఈ అవార్డు ప్రధానం చేసే సమయంలో ఆ ప్రాంగణం మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది . స్వామి శివానంద వయసు 125 సంవత్సరాలు . భారతీయ సంస్కృతికి ,ధర్మానికి ఆయన సజీవదర్పణం. యోగ విద్య లో ఆయన ఎన్నో ఏళ్లుగా వారణాసిలోని గంగా నది ఒడ్డున యోగాను నేర్పి అందరికీ యోగ గురువు గా ఎంతో ప్రసిద్ధి చెందారు.

    ఆయన , 125 సంవత్సరాల సుదీర్ఘ కాలం జీవించి ఉండడమే కాదు అవార్డు తీసుకునే సమయంలో మోకాళ్ళతో మోకరిల్లి తన సనాతన ధర్మ గౌరవాన్ని చాటిచెప్పిన ఆయన గొప్పతనం ఇప్పుడు చర్చనీయాంశం. ఇప్పటివరకు ఇలా వినయంగా వినమ్రంగా సనాతన ధర్మం ప్రకారం అవార్డు తీసుకున్న వారిలో స్వామి శివానంద ప్రధములు.. ఇదే కార్యక్రమంలో కిన్నెర వాయిద్యం కళాకారుడు ,కిన్నెర మొగులయ్య, ప్రముఖ ప్రవచనాకారుడు గరికపాటి నరసింహారావు కూడా పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. అనేకమంది రాష్ట్రపతి భవన్లో సోమవారం నాడు పద్మశ్రీ అవార్డులు ఇతర అవార్డులు తీసుకున్నప్పటికీ స్వామి శివానంద అవార్డు తీసుకున్న విధానం తీరు ప్రత్యేకం, ..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..