భార్య బిజెపికి ఓటేసిందని ఇంట్లోనుంచి తరిమేశారు..

    0
    81

    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను బీజేపీకి ఓటు వేశనని, తన భర్త అత్తమామలు , బంధువులు తనను ఇంటి నుంచి గెంటి వేశారు అని ఉజ్మాఅన్సారి అనే మహిళ ఆరోపిస్తోంది . కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం త్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని ప్రకటించడంతో తాను బీజేపీకి అనుకూలంగా ఓటు చేశానని ఆమె స్పష్టం చేసింది . ముస్లిం మహిళలకు ఇదెంతో మేలుచేస్తోందని చెప్పింది. అయితే తన భర్త ,ఆయన మేనమామ తాను బీజేపీకి ఓటు చేశానని తనను కొట్టి ,ఇంటి నుంచి బయటకు గెంటివేశారని చెప్పింది.

    తన భర్త తాను ప్రేమించి పెళ్లిచేసుకున్నామని తెలిపింది. అయినా నిర్దాక్షిణ్యంగా గెంటేశారని చెప్పింది. ముస్లిం మహిళల విడాకుల విషయంలో తాను బిజెపిని సమర్థిస్తానని , మహిళల హక్కులను బీజేపీ కాపాడిందని తెలిపింది. అందువల్లనే తాను మనస్సాక్షి ప్రకారం ఓటు చేశారని చెప్పింది అయితే సమాజ్వాది పార్టీకి ఓటు చేయాల్సిందిగా తన భర్త ఆయన మేనమామ చెప్పిన మాటలను తానువినలేదని , ఆ విషయమే వారికి స్పష్టంగా చెప్పానని కూడా తెలిపింది, కేసుపెడితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు ఆమె మీడియా ముందుకొచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..