వెయ్యికోట్లు మోసం చేసి , వేషం మార్చి ఉల్లిపాయలు అమ్ముతూ..

    0
    443

    మోసగాళ్లలో ఈ మోసగాడు మరీ వెరైటీ .. వీడి తెలివి తెల్లారి టైం బాగాలేక పోలీసులకు చిక్కిపోయాడు.. పీయూష్ తివారి అనే వ్యక్తి అపార్ట్మెంట్లు ,ప్లాట్లు అమ్మకాల్లో మోసం చేసి 1000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు .. బిల్డర్ అయిన ఇతడు ఒక ప్లాట్ ని అనేకమందికి అమ్మి ఇలా వ్యాపారంలో అనేకమైన మోసాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ,ఇప్పుడు ఉల్లిపాయలు అమ్మే వ్యక్తి వేషం వేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేశాడు పీయూష్ తివారిపై దాఖలైన వందల చీటింగ్ కేసులను కోర్టు విచారించి అతడిని దోషిగా తేల్చింది.

    వెయ్యి కోట్లు చీటింగ్ చేసాడని నిర్దారించింది. అయితే కోర్టు శిక్ష నుంచి తప్పించుకునేందుకు తివారి పునీత్ భరద్వాజ్ గా పేరు మార్చుకొని , వేషం వేసుకున్నాడు . తన అడ్రస్ మార్చేశాడు. కోర్టు తీర్పు తర్వాత తప్పించుకుని తిరుగుతున్నాడు . ఢిల్లీ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు . మార్చి 20వ తేదీ పోలీసులకు ఒక సమాచారం లభించింది. ఈ మోసగాడు , పునీత్ భరద్వాజ్ పేరుతో మారువేషంలో ఉల్లిపాయలు అమ్ముతున్నాడని విశ్వసనీయమైన సమాచారం దొరికింది. దీంతో పోలీసు బృందం నాసిక్ కి వెళ్ళింది .

    దాదాపు 30 చీటింగ్ కేసులో తప్పించుకొని , నాసిక్ లో ఉల్లిపాయలు అమ్ముకుంటున్న తివారీని పోలీసులు అరెస్టు చేశారు . 2011 లో బిల్డర్ అవతారమెత్తిన ఇతడు ,ఢిల్లీ ,నోయిడా చుట్టుపక్కల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాడు. 15 నుంచి 20 వరకు బోగస్ కంపెనీలు ఏర్పాటు చేశాడు. ప్రభుత్వానికి కూడా 120 కోట్ల రూపాయలు పన్ను ఎగవేసే శాడు . ఒకే ప్లాటును పలువురికి అమ్మడం ద్వారా పెద్ద ఎత్తున చీటింగ్ పాల్పడ్డాడు. దీంతో ఆయనపై చాలా పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు అయ్యాయి ఈ విధంగా దాదాపు 1000 కోట్ల రూపాయలు సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడు, ఆయన భార్య శిఖ కూడా ఈ మోసంలో భాగస్వామిగా ఉంది . ఇప్పుడు భార్యభర్తలిద్దరు జైల్లోఊచలు లెక్క పెట్టుకుంటున్నారు..

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..