కాశ్మీరీ ఫైల్స్ సినిమాపై వ్యాఖ్యలు ..ఐఏఎస్ అధికారికి నోటీస్..

  0
  57

  సంచలనం సృష్టిస్తున్న కాశ్మిర్ ఫైల్స్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్ కి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కాశ్మీరీ ఫైల్స్ సినిమా లాంటి సినిమాపై ఒక ఐఏఎస్ అధికారి వివాదస్పద విమర్శలు చేయడాన్ని తప్పుగా పరిగణిస్తున్నామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది . 2015 బ్యాచ్ కి చెందిన నియాజ్ ఖాన్ కాశ్మీర్లో పాత కథలు సినిమాగా తీసి నట్టే దేశంలో అనేక రాష్ట్రాలలో ముస్లిములపై జరిగిన హత్యాకాండ పై కూడా సినిమా తీయాలని కాశ్మీరీ ఫైల్స్ సినిమా నిర్మాతలను కోరాడు . ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి .

  ప్రస్తుతం పబ్లిక్ పబ్లిక్ వర్క్స్ లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని, వారం రోజుల లోపల తన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ అధికారుల పరిధి, పరిమితిని ఆయనఅతిక్రమించారని స్పష్టం చేసింది. తన పేరులో ఖాన్ ఉన్న పదం ఉండడం వల్లే తనను ప్రభుత్వం వేధిస్తోందని ఆ అధికారి చెప్పాడు.

  తాను ఐఏఎస్ అధికారినే , కాకుండా రచయిత కూడా అని , అందువల్ల తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని , అది తనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కని చెప్పారు. కాశ్మీరీ ఫైల్స్ సినిమాపై తాను నాలుగు అభిప్రాయాలను పోస్ట్ చేస్తే వాటిలో రెండు ఆ సినిమా గురించి, మరో రెండు రాజకీయ నాయకుల గురించి అని తెలిపారు .

  ఒక పోస్టింగ్ లో నేరుగా మజ్లీస్ నేత ఓవైసీ నుద్దేశించి ఓవైసీ గారు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు ఒక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎన్నికల్లోనే కాదు అయిపోయిన తర్వాత కూడా మాట్లాడండి అన్నారు. హిందూ సోదరులతో కలిసి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించాలి , అదేమనకు ఆదర్శం కావాలి, అరబ్ సంస్కృతి కాదు , అంటూ ఇదే మన మాతృభూమి అంటూ కూడా ట్వీట్ చేశారు. కాశ్మీరి ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి యాక్టర్ అమీర్ ఖాన్ పై కూడా విమర్శలు చేశారు

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..