హీరోయిన్ ప్రియమణికి సవతి పోరు మొదలైంది.

  0
  615

  టాలీవుడ్‌ హీరోయిన్ ప్రియమణి పెళ్ళి వివాదాస్ప‌ద‌మైంది. తమిళనాడుకు చెందిన ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను 2017లో ప్రియ‌మ‌ణి పెళ్ళి చేసుకున్న విష‌యం తెలిసిందే. వారిద్ద‌రూ అన్యోన్యంగానే ఉన్నారు. అయితే, తాజాగా ముస్తఫారాజ్ మొదటి భార్య ఆయేషా తెరపైకి వచ్చింది.

  తాము విడాకులు తీసుకోలేదని, ప్రియమణితో తన భర్త రెండో పెళ్లి చెల్లదని చెబుతోంది. ముస్తఫా, తాను ఇప్పటికీ భార్యాభర్తలమేనని, ప్రియమణితో అతడి పెళ్లి నాటికి తాము విడాకులకు కూడా దరఖాస్తు చేయలేదని స్పష్టం చేసింది. కాగా, ముస్తఫారాజ్, ఆయేషా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  అయితే విభేదాల నేపథ్యంలో 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. 2017లో ప్రియమణిని ముస్తఫారాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో, భర్త ముస్తఫా రాజ్ తనను, తన పిల్లలను పట్టించుకోవడంలేదని ఆయేషా తాజాగా ఆరోపించింది. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌తో ప్రియ‌మ‌ణి చిక్కుల్లో ప‌డ్డ‌ట్ల‌యింది.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?