మా అధ్యక్షుడుగా బాలయ్య ఓకే.. మంచు విష్ణు.

  0
  219

  సెప్టెంబ‌రులో జ‌రిగే ‘మా’ ఎన్నికలు టాలీవ‌డ్ లో హీట్ పెంచేస్తున్నాయి. అధ్యక్ష పదవి కోసం పోటీ చేయబోతున్నట్టు ఇప్పటి వరకు ఐదుగురు ప్రకటించారు. వీరిలో హీరో మంచు విష్ణు, ప్ర‌కాష్ రాజ్ ల మ‌ధ్య హోరాహోరీగా పోటీ జ‌ర‌గ‌నుంది. ఇటీవ‌ల ‘మా’ ఎన్నిక‌ల‌పై నంద‌మూరి బాల‌కృష్ణ స్పందించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ ‘మా’ అధ్యక్షుడైతే తాను ఎంతో సంతోషిస్తానని, ఆయ‌న‌ త‌న‌కు సోద‌రుడి లాంటి వాడ‌ని స్ప‌ష్టం చేశారు. ఇండస్ట్రీ పెద్దలంతా ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే పోటీ నుంచి తాను తప్పుకుంటానని… లేకపోతే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏకగ్రీవంగా ఎవరిని ఎన్నుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. ఇక‌ నాగబాబు తనకు తండ్రిలాంటి వ్యక్తి అని, ఆయనంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ‘మా’ శాశ్వత భవన నిర్మాణంపై తన ప్లాన్ ఏమిటో చెప్పాలని నాగబాబు వేసిన ప్రశ్నకు బదులుగా… రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారితో మాట్లాడి ‘మా’కు కావాల్సిన భూమిని సంపాదించగలననే నమ్మకం ఉందని బ‌దులిచ్చారు. బాల‌య్య అధ్య‌క్షుడు అయితే అభ్యంత‌రం లేదంటూ విష్ణు చేసిన ఈ వ్యాఖ్య‌లు ఎటు దారి తీస్తాయో వేచిచూడాలి.

  ఇవీ చదవండి..

  ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

  అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

  అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

  నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?