వీడో నీఛుడు.. లవర్ కూతురికి కడుపు చేశాడు..

  0
  6480

  వాడో ప్రైవేటు బస్సుకి డ్రైవర్ గా పనిచేసేవాడు. పేరు చరణ్ రాజ్ వయసు 50ఏళ్లు. అదే బస్సులో క్లీనర్ గా పనిచేసే కుప్పుస్వామి ఇంటికి తరచూ వెళ్లేవాడు. ఆ క్రమంలో కుప్పుస్వామి భార్య కోమదితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన కుప్పుస్వామి భార్య కోమదితో తరచూ గొడవపడేవాడు. ఈ గొడవలు పడలేక కోమది భర్తనుంచి విడిపోయింది. తన 13ఏళ్ల కుమార్తెను తీసుకుని డ్రైవర్ చరణ్ రాజ్ తో వెళ్లిపోయింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట నుంచి వెళ్లిపోయి వీరిద్దరూ పెద్దకుప్పంలో కాపురం పెట్టారు.

  ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల క్రితం కోమది కూతురుకి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించగా, గర్భిణి అని డాక్టర్లు చెప్పారు. చరణ్‌ రాజ్‌ తరచూ బెదిరింపులకు గురి చేసి అత్యాచారం చేశాడని బాలిక చెప్పింది. కోమది వెంటనే తిరువళ్లూరు మహిళా పోలీసు స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న చరణ్‌ రాజ్‌ ని అరెస్ట్ చేశారు. చరణ్‌ రాజ్‌ వల్ల గర్భం దాల్చిన బాలిక రెండు వారాల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇద్దరూ బాలికల సంరక్షణ కేంద్రంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.