లవర్ మాటలు విని పురుగుల మందు తాగాడు.. చివరికి

  0
  333

  కలసి ఎలాగూ బతకలేం, కనీసం కలసి చనిపోదాం అంటూ తన లవర్ కి చెప్పింది ఆ యువతి. నేను వస్తున్నా నువ్వు పురుగుల మందు తాగి, నాక్కూడా కొంచెం ఉంచిపెట్టు అన్నది. నిజమేనని నమ్మిన ఆ యువకుడు ఆమె చెప్పినట్టే చేశాడు. అయితే అనుకున్న టైమ్ కి ఆ యువతి మాత్రం రాలేదు, అదే టైమ్ కి ఆమె ఎంగేజ్ మెంట్ జరిగిపోయింది. ఇక్కడప్రియుడు మృత్యువాత పడ్డాడు.

  వికారాబాద్ జిల్లా, దోమ మండలం, కిష్టాపూర్‌లో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. అయితే ఈ ఘటనకు కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిష్టాపూర్‌ కు చెందిన వినయ్ గత నెల 29న పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించారు.
  వినయ్ మరణించిన మరుసటి రోజు అతని సెల్ ఫోన్, వాట్సాప్ చూడగా అదే గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు కుటుంబసభ్యులు గుర్తించారు. ఇద్దరం కలిసి చనిపోదాం అంటూ ఆ యువతి వినయ్‌ తో పదే పదే చాటింగ్ చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినయ్ మృత దేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వినయ్ అంత్యక్రియలు జరిగిన రోజే ఆ యువతికి ఎంగేజ్‌మెంట్ జరిగిందని, తన కుమారుడి అడ్డు తొలగించుకోవాలని ఆత్మహత్యకు పురమాయించిందని వినయ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  ఇవీ చదవండి..

  చావులోనూ బావను వెదుక్కుంటూ వెళ్ళిపోయింది..

  ఇదేం పని , శవం ముందు డాన్స్ ఏమిటి..?

  హిజ్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత..?

  పాలు పొంగించే కార్యక్రమానికి ముందురోజు రాత్రి ఒక ముఖ్యమైన పని చేయాలి.