మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

  0
  2174

  అతనొకప్పటి ప్రపంచ రెజ్లర్. WWF పోటీల్లో సూపర్ స్టార్ గబ్బీ టఫ్ట్. అయితే ఇంత బలవంతుడు కొంతకాలం పాటు ఒకరకంగా కొన్నేళ్లపాటు తనలో తాను కుమిలిపోయాడు. పెళ్లయి, పిల్లలున్నా తనలో ఆడతనం ఉందని, దేవుడు తనను ఆడమనిషిగా పుట్టించి మగతనాన్నిచ్చాడన్నది అతని మనసులో సంఘర్షణ. దీంతో పెళ్లయిన 15ఏళ్లకు బిడ్డలు ఉన్నప్పటికీ, తనలోని ఆడ, మగ లక్షణాల మధ్య జరుగుతున్న సంఘర్షణను ఎట్టకేలకు జయించాలనుకున్నాడు. మగ జీవితాన్ని వదిలేసి ఆడమనిషిగానే ఉండిపోవాలనుకున్నాడు. అందుకే భార్య, బిడ్డలు, స్నేహితులు.. అందరితో చర్చించి ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జెండర్ గా మారిపోయాడు.

  మానసిక సంఘర్షణ

  తాను ఆడతనంతో జీవించాలనుకోవడం, ఆ విధంగా తనను తాను మలచుకోవడంలో తనకెంతో ఆనందంగా ఉందని, ఇన్నాళ్లకు తనలోని మానసిక సంఘర్షణకు స్వస్తి పలికానని తెలిపాడు. తన బిడ్డ పుట్టినరోజు, తన పెళ్లిరోజు కంటే తాను మగ జీవితాన్ని వదిలేసిన ఈరోజే తనకెంతో గర్వంగా, సంతోషంగా ఉందని చెప్పాడు. 2012లో WWF పోటీలకు శాశ్వతంగా స్వస్తి పలికిన టఫ్ట్ అప్పట్లో తన భార్య, బిడ్డతో సంతోషంగా గడపాలని తాను పోటీనుంచి విరమించుకుంటున్నట్టు చెప్పాడు. 2002లో ఆయనకు పెళ్లయింది.

  భర్తకి అండగా భార్య

  తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని భార్య ప్రిసిల్లా కూడా ప్రశంసించింది. ఇన్నేళ్లు తన భర్త ప్రేమను పొందగలిగానని, ఆయన ప్రేమ అనంతమైనదని, ఆయితే ఆయనలోని మానసిక సంఘర్షణను అర్థం చేసుకుని సహకరించాల్సిన బాధ్యత తనకు కూడా ఉందని, ఈ లైంగిక మార్పు తన జీవితంలో ఎటువంటి కల్లోలం సృష్టించదని యథావిధిగానే తమ జీవితం సాగిపోతుందని తెలిపింది.

  https://www.instagram.com/p/CIQdLCynEe0/

  టఫ్ట్ కూతురు కూడా తన తండ్రి నిర్ణయాన్ని సంతోషంతో స్వాగతించింది. తన తండ్రిని తానెప్పుడూ తప్పుబట్టనని, మానసిక సంఘర్షణను తనలోనే ఉంచుకుని కుమిలిపోయే బదులు, తన తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించింది.

  https://www.youtube.com/watch?v=kpe9gT-s5YM

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

   

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

   

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..