రాందేవ్ బాబా కరోనిల్ చీటింగ్ వ్యాపారంతో 420 కోట్లు కొట్టేసాడు..

    0
    317

    బాబా ముసుగులో వంద‌ల కోట్ల‌కు ప‌డ‌గెత్తిన రాందేవ్ బాబా మోసంపై ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. క‌రోనిల్ మందు పేరుతో రాందేవ్ బాబు 420 కోట్లు కొల్ల‌గొట్టాడు. క‌రోనా రాకుండా వ్యాధి నిరోధ‌క శ‌క్తిని క‌రోనిల్ పెంచుతుంద‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేసి, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి ఈ మందును అమ్మేశాడు. ఈ మందు ఏ విధంగానూ ప‌నికి రాద‌ని, మ‌న దేశం నుంచి అంత‌ర్జాతీయ సంస్థ‌లు చెప్పినా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అనుకూల‌మైన వ్య‌క్తి కాబ‌ట్టి, య‌ధేశ్చ‌గా ఈ మందును అమ్మేసుకున్నాడు. ఇవ‌న్నీ చాల‌ద‌న్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ త‌న మందుకు స‌ర్టిఫికెట్ ఇచ్చిందంటూ ఒక త‌ప్పుడు ప‌త్రం జారీ చేసి మ‌ళ్ళీ త‌న మోసాన్ని నిరూపించుకున్నాడు. అటువంటి స‌ర్టిఫికెట్ ఏదీ తాము మంజూరు చేయ‌లేద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స్ప‌ష్టం చేసింది. ఈ స‌ర్టిఫికెట్ ను ఆవిష్క‌రించే కార్య‌క్ర‌మానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రావ‌డం మ‌రీ విచిత్రం.

    క‌రోనిల్ వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంద‌ని, రాందేవ్ బాబా చెప్తున్న మాట‌లు నిజ‌మే అయితే, 35వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సిన్ కొన‌డం ఎందుకని, ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ ప్ర‌శ్నించింది. క‌రోనిల్ వంటి భోగ‌స్ మందుల‌ను మార్కెటింగ్ చేసుకునేందుకు రాందేవ్ బాబా చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రావ‌డం, ఆ మందుల‌ను గురించి ప్ర‌శంసించ‌డం సిగ్గు చేట‌ని పేర్కొంది.

    ఇవి కూడా చదవండి:

    మగతనం నచ్చలేదు.. నేను ఆడదానినే..

    ఆ జల ప్రళయాన్ని చేపలు ఎలా పసిగట్టాయి..?

    బట్టల మధ్య , అద్దం ఉన్న అల్మరాలో డబ్బులు ఎందుకు పెట్టకూడదు.?