స్మార్ట్ ఫోన్ కొని , భారీ ఊరేగింపుతో ఇంటికి..

  0
  489

  పావలా కోడికి , పదిరూపాయల మసాలా.. అన్న సామెత సంగతి ఎలాఉన్నా ఈ పేదవాడు మాత్రం 12 వేల రూపాయల మొబైల్ ఫోన్ కొని , అంతకంటే ఎక్కువగా ఆ మొబైల్ ఫోన్ ని ఊరేగించి , బంధుమిత్రులకు పార్టీ ఇచ్చాడు.. ఇదంతా కూతురు కోరిక మేరకే ఘనంగా చేసాడు. మధ్యప్రదేశ్ లోని శివపురిలో , మురాని కుష్వాహా అనే వ్యక్తి వీధుల్లో సైకిల్ పైన టీ అమ్ముకొని బతుకుతుంటాడు. ఐదేళ్ల కూతురు స్మార్ట్ ఫోన్ కావాలని మారాం చేసింది. కుష్వాహా కూతురికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చి , పెద్ద ఊరేగింపు కూడా చేస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం కూతురికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చి , ఒక రథంలో కూర్చోబెట్టి , మేళతాళాలతో ఊరేగించి , ఇంటికి స్మార్ట్ ఫోన్ తెచ్చాడు. ఇంటివద్ద , బంధుమిత్రులకు పార్టీ కూడా ఇచ్చాడు..

   

  ఇవీ చదవండి… 

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.