ఏపీలో కూడా కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త..

    0
    151

    దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మన పొరుగు రాష్ట్రం తెలంగాణ తొలి మూడు స్థానాల్లో ఉంది. ఇక ఏపీ విషయానికొస్తే.. ఏపీలో తొలి కేసు విజయనగరం జిల్లాలో నమోదయినా.. ఆ ఫలితం వచ్చేలోపు అతడికి కొవిడ్ నెగెటివ్ వచ్చిందని ఆ కేసుని లిస్ట్ లోకి తీసుకోలేదు. తాజాగా తిరుపతిలో మరో కేసు నమోదయింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. 39 ఏళ్ల ఆ మహిళ ఈనెల 12న కెన్యా నుంచి చెన్నై వచ్చారు.

    ఏపీలో ఒమిక్రాన్
    ఏపీలో ఒమిక్రాన్

    అక్కడి నుంచి తిరుపతి చేరుకున్న మహిళ నమూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కు పంపారు. ఆమెకు ఒమిక్రాన్‌ సోకినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అయితే ఆ మహిళ కుటుంబసభ్యులకు మాత్రం నెగటివ్‌ వచ్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో తొలి ఒమిక్రాన్‌ కేసు విజయనగరం జిల్లాలో నమోదు కాగా రెండో కేసు చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

    ఇవీ చదవండి… 

    పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

    ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

    పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

    తిరుమల నామాల పార్కులో కోడె నాగు.